ప్రధానమంత్రి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారాల్ని చాలాసార్లు చూసి ఉంటారు. ఎప్పుడైనా.. ఏ ప్రమాణస్వీకారం సందర్భంగా అయినా.. సదరు నేత ప్రమాణం చేసిన తర్వాత.. నేరుగా రిజిస్టర్ వద్దకు వెళ్లటం అక్కడ సంతకాలు పెట్టటం. . ఆతర్వాత ప్రమాణాన్ని చేయించింది రాష్ట్రపతి అయితే.. ఆయనకు.. లేదంటే గవర్నర్ అయితే గవర్నర్ కు మర్యాదపూర్వకంగా నమస్కారం చేస్తారు. దీనికి ప్రతిగా వారు కూడా ప్రతి నమస్కారం చేస్తారు.
మూడు రోజుల క్రితం యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వేళలో.. ఎప్పుడూ జరగని ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. ప్రమాణం చేసిన అనంతరం రిజిస్టర్ లో సంతకం పెట్టి గవర్నర్ వద్దకు వెళ్లి నమస్కారం చేయగా.. ఆయన అనూహ్యంగా ఒక పూల బొకేను యడ్డీ చేతిలో పెట్టారు.
సాధారంగా ఇలాంటి చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. గవర్నర్ ఏ చేత్తో బొకేను ఇచ్చారో కానీ.. ఆ బొకేలోని పూలు ఇంకా వాడి ఉండవు కానీ.. యడ్డీ పదవి మాత్రం పోయిందని చెప్పాలి. సంప్రదాయానికి విరుద్ధంగా ఇచ్చిన పూలబొకే రానున్న రోజుల్లో ఏ ముఖ్యమంత్రి మరే గవర్నర్ ఇవ్వరేమో?