య‌డ్యూర‌ప్ప రాజీనామా

Update: 2018-05-19 08:40 GMT
ఏంటి ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి య‌డ్యూర‌ప్ప రాజీనామానా ? అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఆ విష‌యం తేల‌డానికి ఈ సాయంత్రం వ‌ర‌కు ఆగాల్సిందే.  క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా మూడోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన య‌డ్యూర‌ప్ప త‌న లోక్ స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఆయ‌న‌తో పాటు గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి స‌న్నిహితుడు శ్రీ‌రాములు కూడా లోక్ స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. యడ్యూరప్ప షిమోగ లోక్ సభ స్థానం నుంచి - శ్రీరాములు బళ్లారి లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇక ఈ రోజు సాయంత్రం వ‌ర‌కు శాస‌న‌స‌భ‌లో బ‌ల‌ప‌రీక్ష నిరూపించుకోవాల‌న్న సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ ఈ రోజు స‌మావేశం అయింది. య‌డ్యూర‌ప్ప‌ - కుమార‌స్వామి - సిద్ద‌రామ‌య్య‌ - ప్రొటెం స్పీక‌ర్ బోప‌య్య‌ల‌తో పాటు 192 మంది శాస‌న‌స‌భ్యులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. మొత్తం 221 మందికి గాను ఇంకా 25 మంది ఎమ్మెల్యేలు ప్ర‌మాణ‌స్వీకారం చేయాల్సి ఉన్న నేప‌థ్యంలో ఉత్కంఠ నెల‌కొంది.

25 మంది ఎమ్మెల్యేలు ఎక్క‌డ ఉన్నారు ? ఏం చేయ‌బోతున్నారు ? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు శాస‌న‌స‌భ తిరిగి స‌మావేశం కాబోతుంది. బ‌లం నిరూపించుకోలేకుంటే ఏం చేయాలి ? ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాలి ? అని య‌డ్యూర‌ప్ప స‌మావేశం నిర్వ‌హించార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో బీజేపీ శ్రేణుల‌లో ఆందోళ‌న నెల‌కొంది. సాయంత్రం వ‌ర‌కు ఆగితే గానీ ఏ విష‌యం తేలేలా లేదు.


Tags:    

Similar News