కర్ణాటక సీఎం రాజీనామా ... క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి !

Update: 2021-07-17 10:30 GMT
కర్ణాటకలో పలు నాటకీయ పరిణామాల మధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, ఆ తర్వాత సీఎంగా అపరా అనుభవం ఉన్న యడ్డ్యూరప్ప  వైపే అధిష్టానం తొంగిచూసింది. అయితే, ఆ తర్వాత నుండి సీఎం గా ఆయన్ని మార్చి , ఇంకొకరిని కుర్చీలో కూర్చోబెడతారు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయన సీఎంగా రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఢిల్లీ వెళ్లటం..ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాలతో భేటీ కావటంతో ఆయన మరోసారి రాజీనామా చేస్తారనే వార్తలు వైరల్ అయ్యాయి.  

కర్ణాటకలో నాయ‌క‌త్వ మార్పులు .. ఆయన రాజీనామా వార్తలపై యడ్యూరప్ప స్పందించారు. రాజీనామా ఊహాగానాల‌ను యడ్యూరప్ప ఖండించారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో క‌ర్ణాట‌క‌లో పార్టీ అభివృద్ధిపై చ‌ర్చించామ‌ని, తన ప‌ట్ల అధిష్టానానికి మంచి అభిప్రాయం ఉంద‌ని తాను అధిష్టానంతో భేటీ అయ్యింది క‌ర్ణాట‌క‌లో సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి వంటి పలు కీలక విషయాలు చర్చించామని అంతేతప్ప తను రాజీనామా చేయటం అంతా కేవలం పుకార్లు మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాన‌ని యడ్డ్యూరప్ప ఈ సందర్భంగా తెలియజేశారు.

క‌ర్ణాట‌క‌ లో సాగునీటి ప్రాజెక్టుల విష‌యంపై చ‌ర్చించేందుకు మాత్ర‌మే ఢిల్లీ వ‌చ్చాన‌ని, ఆగ‌స్టులో మ‌రోసారి ఢిల్లీకి వ‌స్తాన‌ని ఆయన మీడియోకు వెల్లడించారు. మేకెదాటు ప్రాజెక్టు పై కేంద్ర‌మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ న‌డ్డాతో చ‌ర్చించాన‌ని తెలిపారు. ఈ ప్రాజెక్టు అనుమ‌తుల కోసం కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రిని కూడా క‌లిసి చ‌ర్చించాన‌ని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టును సాధించి తీరుతామ‌ని యడ్యూరప్ప స్ప‌ష్టం చేశారు.

దీనితో ఆయన రాజీనామా చేస్తారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. కాగా గతంలో యడ్యూరప్ప సీఎం అయినా పూర్తికాలం సీఎంగా కొనసాగకుండానే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో నాలుగో సారి కూడా ఆయన పూర్తికాలంగా పదవిలో కొనసాగకుండానే రాజీనామా చేస్తారని, కర్ణాటకలో నాయకత్వాన్ని మార్చాలని బీజేపీ అధిష్టానం అనుకుంటోందని, అందుకే ఆయన ఢిల్లీ వెళ్లి కమలం పెద్దలను కలిసారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై యడ్యూరప్ప క్లారిటీ ఇవ్వటంతో ఇక ఆయన రాజీనామా పర్వానికి తెరపడినట్లు అయ్యింది.
Tags:    

Similar News