పీకేని సాంతం వాడేస్తున్న ఆ పచ్చ పత్రిక!

Update: 2017-06-24 13:39 GMT
జగన్ మీద రాళ్లేయడం ఆ పచ్చ పత్రికకు కొత్తేమీ కాదు. తెలుగుదేశం పార్టీకి అధికారం లేని రోజుల నుంచి, జగన్ సొంత పేపర్ పెట్టినప్పటి నుంచి, ఇంకా అంతకు ముందు నుంచినే ఏదో విధంగా జగన్ మీద రాళ్లేయడం ఆ పత్రిక పని. జగన్ మీద మానసిక విశ్లేషణలే రాసినా, వీకెండ్ కామెంట్స్ పేరుతో అవాకులు చవాకులు పేలినా అది వాళ్ల దినచర్య. జగన్ పేరును పతాక శీర్షికల్లో వేసుకుని, జగన్ వ్యతిరేకులకు వాటిని అమ్ముకొంటూ, తెలుగుదేశం అభిమానులకు ధైర్యం చెబుతూ సాగుతోంది ఆ మీడియా వర్గం ప్రస్థానం.

మరి ఈ క్రమంలో ఇటీవలి కాలంలో జగన్ పై ధ్వజమెత్తడానికి  ఆ పత్రికకు కొత్త ఆయుధం దొరికింది. ఆ ఆయుధం మరేదో కాదు... ప్రశాంత్ కిషోర్ పేరు. పీకే అనే షార్ట్ ఫామ్ తో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన ప్రశాంత్ కిషోర్ ఇటీవలి కాలంలో ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. జగన్ రాజకీయ సలహాదారుగా నియమితం అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వైకాపా ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. నియమితం అయ్యాడనేది మాత్రం రాజకీయ వర్గాల సమాచారం. ఇది దాదాపుగా నిజం కూడా. కానీ ఆ పచ్చ పత్రికలో మాత్రం ఇప్పటి వరకే పీకేపై బోలెడన్ని కథనాలు వస్తున్నాయి. అన్ని సారాంశం ఒకటే.. వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవవు అని జగన్ కు పీకే స్పష్టం చేశాడనేది!

ఒక్కోరోజు ఒక్కోరకమైన రాతలతో స్వయం ఆనందాన్ని పొందుతోంది ఆ పచ్చపార్టీ కరపత్రిక. కొన్ని రోజుల కిందట దాంట్లో ఒక కథనం వచ్చింది.. దాని సారాంశం ఏమనగా, వచ్చే ఎన్నికల్లో సొంతంగా ఢీ కొని పీకే జగన్ కు చెప్పాడని.. వీలైతే కాంగ్రెస్ ను - పవన్ కల్యాణ్ ను - కమ్యూనిస్టులను కలుపుకపోవడాని ఉద్భోధిండని, అయినప్పటికీ గెలవడం కష్టమే .. బాబుగారి హవా ఆ స్థాయిలో ఉందని చెప్పాడని తన మాటను పీకే మాటగా రాసుకొచ్చింది.

ఇక తాజాగా పీకే సర్వే పేరుతో కొత్త వాదన వినిపిస్తోంది. ఈ సర్వేసారాంశం ఏమనగా.. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి యాభై సీట్ల వరకూ వస్తాయని మాత్రమే పీకే సర్వే తేల్చిందట. తెలుగుదేశం మాత్రం మొన్నటికి మించిన స్థాయిలో సీట్లను సాధిస్తుందట.. ఇది తన అభిప్రాయం అని చెబితే జనాలు నవ్వుతారని, పీకే కు ఆపాదించింది ఆ తోకపత్రిక.

ఇలా వరసగా పీకేను ఇష్టానుసారం వాడేస్తూ ఆ పత్రిక తెలుగుదేశం పార్టీకి సహాయం చేసే పనిలో ఉంది. ఇదంతా చంద్రబాబు మార్కు వ్యూహం అని, తన బలాన్ని ఎక్కువగా చూపించుకోవడానికి బాబు ఇలాంటి జిత్తుల మారి ఎత్తులు వేస్తూ ఉంటాడని.. ఈ క్రమంలోనే ఆ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఆ పత్రిక ఇలాంటి పనులు చేస్తోందని విశ్లేషకులు, తటస్థులు అంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ గురించి వైకాపా శ్రేణుల వద్ద ప్రస్తావించగా, ఇప్పటి వరకూ సర్వేలేమీ లేదని, పార్టీ ముఖ్యనేతలతో ప్రశాంత్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని, పరిస్థితిని అర్థం చేసుకునే యత్నంలోనే ఉన్నాడని కానీ తమ వ్యతిరేకత మీడియా మాత్రం ఇలా రెచ్చిపోతోందని వారు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News