రేపోమాపో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనేది తేటతెల్లం అవుతున్న విషయమే. అందులో ఏ మాత్రం సందేహం లేదని పరిశీలకలు అంటున్నారు. ఎలాగూ ఇప్పుడప్పుడే మళ్లీ ఎన్నికలు లేవు. మళ్లీ ఎన్నికల వరకూ వీలైనంతగా సినిమాలు చేసుకుంటూ.. అప్పుడప్పుడు పార్ట్ టైమ్ రాజకీయాలు చేయాలనేది పవన్ కల్యాణ్ తదుపరి ప్రణాళిక అని స్పష్టం అవుతోంది.
అయితే ఇది వరకూ పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో ప్రకటనలు చేశాడు. తను ఇక సినిమాలు వదిలేసినట్టే అని ప్రకటించాడు. ఇక రాజకీయాలే అని పవన్ తేల్చి చెప్పాడు. అయితే ఇప్పుడు మళ్లీ మాట మార్చడమే అవుతుంది సినిమాల్లోకి వస్తే!
ఎన్నికల ముందు సినిమాలను వీడటం, ఎన్నికలు అయిపోగానే సినిమాలు చేసుకోవడం.. ఇదంతా మెగా బ్రదర్స్ రాజకీయం అని విమర్శలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇలాంటి విమర్శలకు తమకు కొత్తేం కాదన్నట్టుగా పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నాడు.
అయితే పవన్ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్న తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం..ఈ విషయాన్ని టోన్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వస్తారు కానీ… ఇప్పుడప్పుడే కాదు.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు పచ్చ మీడియా వాళ్లు.
పవన్ 'ఆంధ్రప్రదేశ్ సమస్యలు' పై పోరాడతారని పచ్చ మీడియా ప్రకటిస్తోంది. అయితే అదయ్యాకా సినిమాల్లోకి రావడం మాత్రం గ్యారెంటీ అంటోంది. ఇంతకీ ఎప్పడు వస్తాడంటే… రెండు వేల ఇరవైలో నట. దానికి మరెంత సమయం ఉంది అనేది ప్రజలు ఆలోచించరనేది పచ్చ మీడియా భావన కావొచ్చు. రెండు వేల ఇరవై సంవత్సరం రావడానికి మరో రెండు నెలల సమయం కూడా లేదు సుమా! అయినా పవన్ విషయంలో తెలుగుదేశమే కాదు, తెలుగుదేశం అనుకూల మీడియా కూడా చాలానే కష్టపడుతున్నట్టుగా ఉంది డ్యామేజ్ కవరేజుల కోసం!