ఎన్నికల వేళ.. లక్షలాది మంది అధికారులు.. సిబ్బంది ఎన్నికల క్రతువులో పాల్గొంటారు. కానీ.. ఎవరికి దక్కనంత సెలబ్రిటీ స్టేటస్ ఒక అధికారిణికి దక్కింది. ఎల్లో కలర్ శారీ.. కళ్లకు గాగుల్స్ తో.. చేతిలో ఈవీఎం మిషన్ పట్టుకొని వెళుతున్న ఒక ఫోటో దేశ వ్యాప్తంగా అందరి కంట్లో పడటమే కాదు.. సోషల్ మీడియాలో ఆమె ఒక వైరల్ గా మారారు.
ఆమెకు సంబంధించిన ఫోటోలతో పాటు.. వార్తలు చాలానే వచ్చాయి. పీడబ్ల్యూడీలో పని చేసే ఈ అధికారిణి రీనా ద్వివేది అన్న వివరాలతో పాటు.. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలుచాలానే వచ్చాయి. తనకొచ్చిన సెలబ్రిటీ స్టేటస్ విషయంలో ఆమె పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆమె కెమేరాల కంటికి చిక్కారు.
లక్నో కంటోన్ మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో రీనా ద్వివేదికి మరోసారి ఎన్నికల విధుల్ని నిర్వహించే అవకాశం లభించింది. కృష్ణా నగర్ లోని మహానగర్ పబ్లిక్ ఇంటర్ కాలేజిలో ఆమె పోలింగ్ నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో పసుపు రంగు చీరలో వచ్చిన ఆమె.. ఈసారి పింక్ అండ్ గోల్డ్ డిజైనర్ శారీలో కనిపించారు. ఆమె కనిపించినంతనే కెమేరాలు క్లిక్కుమనిపిస్తూనే ఉన్నాయి.
విధి నిర్వహణను పక్కాగా నిర్వహించటమే కాదు.. ఫ్యాషన్ లోనూ తనకున్న ప్రత్యేకతను ఆమెను తాజా ఎన్నికల విధుల సమయంలోనూ ప్రదర్శించారని చెబుతున్నారు. తాజా ఫోటోలతో ఆమె సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారారు. ఆమె ఫోటోలకు నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆమె విధులు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రంలో కెమేరామెన్లు పెద్ద ఎత్తున చేరుకోవటమే కాదు.. ఆమె ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు.
అయితే.. వాటిని ఆమె పెద్దగా పట్టించుకోకపోవటం గమనార్హం. అంతేకాదు.. సెలబ్రిటీ స్టేటస్ అనుకోకుండా వచ్చిందంటూ దానికి తాను పెద్ద ప్రాధాన్యత ఇవ్వనన్న విషయాన్ని ముక్తసరిగా చెప్పేశారు. విధి నిర్వహణలో పక్కాగా వ్యవహరిస్తూ అధికారుల మన్ననలు పొందినట్లు చెబుతున్నారు.
మీడియా కారణంగా తనను అందరూ గుర్తిస్తున్నారని.. గౌరవిస్తున్నారని చెప్పిన ఆమె వ్యక్తిగత విషయాల్లోకి వెళితే.. ఆమెకు 15 ఏళ్ల కొడుకు ఉన్నారు. చిన్నతనంలో పెళ్లి కావటం.. ఆరేళ్ల క్రితం (2013) ఆమె భర్త చనిపోవటంతో ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని రీనాకు ఇచ్చారు. తన కొడుకు సివిల్ సర్వెంట్ కావాలన్నది 32 ఏళ్ల రీనా ద్వివేది కోరికగా చెబుతారు. ఆ స్వప్నాన్నిసాకారం చేసుకునేందుకు తాను పని చేస్తున్నట్లు చెబుతారు. 2014 - 2017 - 2019లో జరిగిన ఎన్నికల్లో ఆమె పనితీరు బాగుండటంతో తాజా ఉప ఎన్నికల్లోనూ విధులు నిర్వర్తించేందుకు ఆమెకు అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక.. ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో భారీ ఎత్తున ఆమెకు ఫాలోయర్స్ ఉన్నారు. ఫేస్ బుక్ లో 4700 మంది ఉంటే.. టిక్ టాక్ లో 8700 మంది ఉండటం గమనార్హం.