``ఆంధ్రప్రదేశ్ మహిళా - శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు - ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న పయ్యవుల కేశవ్ అల్లుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ బీరు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులిచ్చారు. అందుకే ఇటీవల పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరైన కేసీఆర్‌కు ఏపీ మంత్రులు వంగివంగి దండాలు పెట్టారు...నన్ను జైళ్ళో పెట్టించిన కేసీఆర్ కు ఏపీ నేతలు దండాలు పెడతారా?`` అంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన సంచలన కామెంట్ల కలకలం ఇంకా సద్దుమణగలేదు. ఈ కామెంట్లు ఏపీ - తెలంగాణలోని రాజకీయ నేతలను ఆలోచనలో పడేశాయి. అయితే ఏపీలోని సంబంధిత వర్గాల్లో కలకలం రేపింది.
అయితే ఈ ఎపిసోడ్ పై ఏపీ మంత్రి పరిటాల సునిత తనయుడు - పరిటాల శ్రీరామ్ స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి పీఠంపై రేవంత్ రెడ్డికి తెగ ఆసక్తి ఉన్నట్లుందని అందుకే సీమాంధ్రులను పలుచన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశారు. ``తెలంగాణ సీఎం కేసీఆర్ మా కుటుంబానికి సుదీర్ఘకాలంగా మిత్రుడు. అందుకే ఆయన నా వివాహానికి వచ్చారు. మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగానే నేను ఆయన పాదాలకు నమస్కరించాను. ఇందులో తప్పేముంది? మీరు ప్రత్యర్థి పార్టీల నేతల వివాహాలు - ఇతర శుభకార్యాలకు వెళ్లరా? మీ ఇంట్లో జరిగే వేడుకలకు ఇతర పార్టీల వారు హాజరుకారా?`` అంటూ శ్రీరామ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై పరిటాల శ్రీరామ్ సంచలన ఆరోపణలు చేశారు. గత ఏడాదిగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని వ్యూహాత్మకంగా దిగజార్చే పనిలో రేవంత్ ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం, అందులోనూ తెలంగాణలో టీడీపీ కంటే కాంగ్రెస్ బలోపేతంగా ఉందని సందేశాన్ని ఇవ్వడం లక్ష్యంగా రేవంత్ పనిచేస్తున్నారని ఆక్షేపించారు. కాగా, పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవడం ద్వారానే నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని రేవంత్ రెడ్డి బయటపెట్టిన సంగతి తెలిసిందే.