గత కొన్ని రోజులుగా నిత్యావసర సరుకుల ధరలు , అలాగే కూరగాయల ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. గత నెల రోజులుగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి అన్న విషయం అందరికి తెలిసిందే. ఒకానొక సమయంలో ఉల్లి 200 రూపాయల ధరని తాకడం తో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఉల్లి ధరలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాగే పార్లమెంట్ లో సైతం ఉల్లి ప్రకంపనాలు సృష్టించింది.
ఇకపోతే తాజాగా ఉల్లి నడిచిన బాటలోనే ఆలూ కూడా నడుస్తుంది అని తెలుస్తోంది. సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. గత పదిలోజుల్లో ఆలూ రిటైల్ ధర రూ. 100కు పైగా పెరిగింది. సాధారణంగా కిలో ఆలూ రూ. 40 నుంచి 50 ధరలలో లభిస్తుంటుంది. కానీ , ఒక్కసారి గా ఆలూ ధరలు కూడా ఆకాశాన్ని తాకేసాయి. దీనితో ఇప్పటికే ఉల్లి ధరలతోనే ఇబ్బంది పడుతున్న సామాన్యులకి ఆలూ కూడా షాక్ ఇస్తుంది అని చెప్పాలి. అలాగే ఉల్లి, ఆలూ ధరలతో పాటు పాల ధరలు కూడా పెరిగాయి. ఢిల్లీలో మదర్ డెయిరీ, అమూల్ పాల ధరలు గడచిన ఆరు నెలల్లో 10 శాతం మేరకు పెరిగాయి.