ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అల్లోపతి వైద్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాబా రాందేవ్ వ్యాఖ్యలపై వైద్యులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ విభాగం రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే మరోసారి సమయంలో ఆయన మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.
తనను అరెస్టు చేయడం అతడి నాన్న వల్ల కూడా కాదంటూ సెటైర్ వేశారు. ఇది మరో దుమారానికి తేర తీసింది. అల్లోపతి వైద్యం కరోనా నియంత్రణలో విఫలమైందంటూ రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫైర్ అయింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పకపోతే రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలంటూ పరువు నష్టం దావా వేసింది. ఈ దుమారం కొనసాగుతుండగా రాందేవ్ బాబా తాజాగా జూమ్ సమావేశంలో మాట్లాడుతూ.. తనను అరెస్టు చేయడం అతడి నాన్న వల్ల కూడా కాదంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనను దుండడుడు, మహాదొంగ అంటున్నారంటూ నవ్వుతూ చెప్పారు. అయితే, అతడి తండ్రి కూడా తనను అరెస్టు చేయలేరంటూ ఎవరిని ఉద్దేశించి రాందేవ్ ఆ వ్యాఖ్యలు చేశారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. 'నీ తండ్రి కూడా అరెస్ట్ చేయడు' ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.