ఎంఐఎం బెదిరంపులు భరించాలా?: యోగి

Update: 2020-11-28 17:30 GMT
దుబ్బాకలో గెలిచిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ ఇప్పుడు గ్రేటర్ పీఠాన్ని అధిరోహించాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. దిగ్గజ నేతలందరినీ మోహరించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతోంది.

ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో గ్రేటర్ లో ప్రచారం నిర్వహించిన బీజేపీ.. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా రంగంలోకి దింపుతోంది.

ఇక కేంద్రమంత్రులు.. ఇతర రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా ఎంతో మందిని ఉపయోగించుకుంటోంది బీజేపీ .. తాజాగా యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కూడా గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై, ఎంఐఎం పార్టీపై నిప్పులు చెరిగారు.

నిజాం రూపంలో వస్తున్న మరో నయా నిజాం పథకాన్ని పారనివ్వకూడదని.. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం నగరవాసులకు అన్యాయం చేస్తోందని యోగి ధ్వజమెత్తారు. ఎంఐఎం బెదిరింపులు భరించాలా అంటూ యోగి ప్రజలను ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రభుత్వం వరదసాయం పేరిట మోసం చేసిందని.. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే ఈ నగదును పంపిణీ చేయలేదని యోగి ఆరోపించారు.
Tags:    

Similar News