కొన్ని విషయాలు తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నమ్మశక్యమైన విషయాలేనా? అనిపించక మానదు. అందుకు నిలువెత్తు నిదర్శనం యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఉదంతమే. నిజానికి ఆయన యూపీ ముఖ్యమంత్రిగా ప్రకటించక ముందు.. ఆయన పేరు చెప్పినంతనే వివాదాలు.. సంచలనాలు.. కరడుగట్టిన హిందుత్వ వాదిగా మాత్రమే తెలుసు. కానీ.. ఆయన్ను ఊహించిన దానికి భిన్నంగా ఆయనలోని మరికొన్ని కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో ఆయన హిందువుల్లోనే కాదు.. ముస్లింలలో కూడా చక్కటి ఆదరణ ఉందని.. ఆయన మఠంలో పని చేసే వారిలో ముస్లింలు కూడా ఉన్నారన్న కొత్త విషయాలు తెలిసినప్పుడు యోగి సరికొత్తగా కనిపిస్తారు.ఒక వ్యక్తిని చూసే కోణాన్ని బట్టి ఆ మనిషి కనిపిస్తారన్నట్లుగా.. యోగిని యూపీ సీఎం కాకముందు ఆయన గురించి వచ్చిన వార్తలకు.. ఆయన సీఎం అయ్యాక వస్తున్న వార్తలకు ఏ మాత్రం సంబంధం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
తాజాగా ఆయనకు సంబంధించి మరో రెండు కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అందులో ఒకటి.. ఆయన్ను యూపీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తున్న విషయం.. అధికారిక ప్రకటన వెలువడటానికి కేవలం ఒక్కరోజు ముందు మాత్రమే తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తనను యూపీ సీఎంగా ఎంపిక చేస్తున్నట్లు చెప్పిన సమయంలో తనకు కేవలం రెండు జతల దుస్తులు మాత్రమే ఉన్న విషయాన్ని యోగి అదిత్యనాథ్ వెల్లడించారు. కేవలం రెండు జతల దుస్తులు.. నిరాడంబర జీవితంతో ఒక రాజకీయ నాయకుడ్ని ఇవాల్టి రాజకీయాల్లో మనం ఊహించగలమా? అన్న ప్రశ్న మనసులోకి రాక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/