అధికారంలోకి వచ్చిన కొత్తొ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభావమో కానీ.. ఇటీవల యూపీలో కొలువుతీరిన ప్రభుత్వం గడిచిన మూడు.. నాలుగు రోజులుగా అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తన నిర్ణయాలతో యూపీ ఇమేజ్ ను మొత్తంగా మార్చాలన్నట్లుగా ముఖ్యమంత్రి వాదన ఉన్నట్లుగా కనిపిస్తోంది.
పలు ఆసక్తికర నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రభుత్వ కార్యాలయాల్ని పరిశుభ్రంగా ఉంచాలంటూ ప్రతిన చేయించారు. ఆయన ఆదేశాల్ని తాజాగా యోగి క్యాబినెట్ కు చెందిన ఉపేంద్ర తివారీ తూచా తప్పకుండా అమలు చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. తన ఛాంబర్ వద్దకు వెళ్లి.. చీపురు పట్టుకొని తనకు తానే శుభ్రం చేసుకున్నారు. విధానసభలోకి వెళ్లిన ఉపేంద్ర.. అక్కడంతా అపరిశుభ్రంగా ఉండటంతోఅధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడితో ఆగని ఆయన.. తానే స్వయంగా చీపురు పట్టుకొని ఊడ్చటం మొదలెట్టారు. దీంతో.. అధికారులు అవాక్కయ్యారు. ఇలా ఎవరికి వారు శ్రద్ధగా శుభ్రం చేసుకుంటే పరిసరాలు నీట్‌గా ఉంటాయని క్లాస్ పీకారు. అంతకు ముందే.. ప్రభుత్వ కార్యాలయాల గోడలు.. నేతలపైనా పాన్ మరకలు ఉండటాన్ని చూసిన ముఖ్యమంత్రి యోగి.. ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్.. గుట్కా.. పాన్ మసాలా.. ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం మీదా బ్యాన్ విధించారు. అంతేకాదు.. పరిశుభ్రత కోసం ఏడాదిలో వంద గంటలు కేటాయించాలంటూ ప్రతిన చేయించారు. ఓపక్క ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వెళుతున్న ముఖ్యమంత్రి బాటలో ఆయన మంత్రి నడవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/