ఏ మాత్రం వ్యక్తిగత వైరం లేకున్నా.. సైద్ధాంతిక వైరం పేరుతో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై గడిచిన కొంతకాలంగా విరుచుకుపడుతున్నారు యూపీ బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. తనపై యూపీ సీఎం చేసే విమర్శలకు భారీగానే కౌంటర్ ఇస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. సిద్ద.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ను ఇద్దరిని కలిపి టోకుగా తిట్టే కార్యక్రమానికి తెర తీశారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి.
తాజాగా యూపీ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక చిట్టి వీడియోను పోస్ట్ చేశారు. మాట్లాడితే చాలు తనను తాను హిందువునని పలుమార్లు చెప్పుకునే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తాను అధికారంలో ఉన్న కాలంలో జరిగిన హిందువుల హత్యల గురించి ఎందుకు రియాక్ట్ కావంటూ సూటిగా ప్రశ్నిచారు.
గడిచిన మూడేళ్ల వ్యవధిలో పన్నెండు మంది హిందువులు హత్యకు గురైనట్లుగా యూపీ బీజేపీ విడుదల చేసిన వీడియోలో ప్రశ్నించారు. హిందువులు దారుణంగా హత్యకు గురయ్యారని చెప్పటమే కాదు.. వారికి సంబంధించిన ఫోటోల్ని ఈ వీడియోలో అటాచ్ చేశారు. తాను ప్రశ్నించిన ప్రతిసారీ తాను హిందువునని చెప్పే సిద్ధరామయ్య.. తాను సంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు.
కర్ణాటక రాష్ట్ర పగ్గాలు చేతిలో ఉన్న సిద్ధరామయ్య పాలనను తాజా వీడియోలో ఎండగట్టారు. కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ సిద్ధరామయ్య వైఫల్యంపై విమర్శలు చేశారు. సిద్ధరామయ్య హయాంలో దాదాపు 1200 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సీఎం సిద్ధరామయ్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఈ వీడియోలో.. రాహుల్ గాంధీని విడిచిపెట్టలేదు.
గుజరాత్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఆలయాల్ని సందర్శించటంపై విమర్శలు సంధించారు. మత రాజకీయాలతో దేశంలోని ప్రజల మధ్యవిభేదాలు సృష్టించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారంటూ యోగి ఫైర్ అయ్యారు. కేవలం నిమిషం పన్నెండు సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కర్ణాటక సీఎం వైఫల్యాల్ని సూటిగా ఎండగట్టటమే కాదు.. సిద్ధరామయ్యపై వ్యతిరేకత పెరిగేలా ఉందని చెప్పక తప్పదు.