వివాదాస్పద నేత.. ఫైర్ బ్రాండ్.. వగైరా.. వగైరా అన్నింటిని పక్కన పెడితే.. యోగి ఆదిత్యనాథ్ అనబడే అజయ్‌సింగ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయారు. ముందుగా నిర్ణయించిన సమయానికే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద యూపీ ముఖ్యమంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేసిన యోగి తనలోని ఆనందాన్ని ఆయన ఆపుకోలేకపోయారని చెప్పాలి.
గవర్నర్ ప్రమాణస్వీకారం చేయగానే.. ఆయనకు అభివాదం చేసిన యోగి ఆదిత్యనాథ్.. ఆ తర్వాత ప్రధాని మోడీ వద్దకు వెళ్లి ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఆయన పక్కనే ఉన్న వారికి అభివాదం చేసిన ఆయన.. అటుపక్కగా వెళ్లి పార్టీ అధినేత అమిత్ షా.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీలకు అభివాదం చేశారు.
ఇలా వరుసగా అభివాదాలతో ముందుకెళుతున్న యోగి ఆదిత్యనాథ్ ను.. అమిత్ షా ఆపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పుస్తకంలో సంతకం చేయాల్సిన విషయాన్ని మర్చిపోవటాన్ని గుర్తు చేశారు. దీంతో.. తన అభివాదాల్ని ఆపిన యోగి.. పుస్తకంలో సంతకం చేయటానికి వెళ్లారు. మధ్యలో ఉన్న ప్రముఖులకు నమస్కారాలు చెప్పుకుంటూ వడి వడిగా వెళ్లి.. రిజిష్టర్‌లో సంతకం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన సంతోషంలో.. సంతకం మర్చిపోయిన వైనం పలువురి దృష్టిని ఆకర్షించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/