అలహాబాదు... దేశంలో ఎన్ని నగరాలున్నా... అలహాబాదుకు ఉన్న ప్రత్యేకతే వేరు. భారతీయులు పవిత్రంగా భావించే గంగా - యమున - సరస్వతి నదుల సంగమ స్థానానికి కేంద్రమైన అలహాబాదును గతంలో ప్రయాగ అని పిలిచేవాళ్లు. అయితే కాలక్రమంలో ఆ పేరు మరుగున పడిపోగా... కొత్తగా అలహాబాదుగా ఆ నగరానికి పేరు దాదాపుగా స్థిరపడిపోయింది. ఇప్పుడంతా ఆ నగరాన్ని అలహాబాదుగానే పిలుస్తున్నాం. అసలు ప్రయాగ అంటే... అదెక్కడుందని ఇప్పటి పిల్లలు మనలనే ఎదరు ప్రశ్నిస్తారు. ఇక అలహాబాదుకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే... భారత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన ఊరు అదే. అంతేనా.... భారత తొలి మహిళా ప్రధానిగానే కాకుండా ప్రపంచ దేశాల్లోకెల్లా శక్తివంతమైన మహిళా నేతగా పేరుగాంచిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి అడుగులు నేర్పిన నగరం కూడా అలహాబాదే. మొత్తంగా దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించడంతో పాటు స్వతంత్ర భారతావని పాలనా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీలోని కీలక కుటుంబమైన ఫ్యామిలీకి అలహాబాదు పుట్టిల్లు కిందే లెక్క.
అయితే ఏంటి? అలహాబాదుకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటంటారా? ఇబ్బంది కాదండి బాబూ... ఏకంగా అలహాబాదు కనుమరుగు కానుంది. నిజమా? అంటే...నిజమే. అలహాబాదు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కనునమరుగు అంటే... అలహాబాదు పూర్తిగా కనుమరుగు అవుతుందని కాదు గానీ... ఇకపై అలహాబాదు పేరు వినిపించదు. ఎందుకంటే.... అలహాబాదు నగరం పేరును యూపీ సర్కారు మార్చేస్తోంది. ఈ దిశగా యూపీ సర్కారు నుంచి గెటిట్ విడుదలైతే... అలహాబాదు స్థానంలో ప్రయాగ్ రాజ్ అని రాసుకోవాల్సింది. అయినా ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్నది మరెవరో కాదు. ఉత్తరప్రదేశ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్న యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు అలహాబాదు పేరు మార్పునకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారట. యూపీలో సరికొత్త పాలన సాగిస్తానంటూ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాడే ప్రకటించేసిన యోగీ... ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో కొన్నింటికి జనం బ్రహ్మరథం పట్టగా, మరికొన్నింటిని జనమంతా కూడా తిరస్కరించేశారు.
అయినా కూడా ఏమాత్రం పట్టించుకోని యోగీ... తనదైన సంచలన నిర్ణయాలు తీసుకునే శైలిని మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలోనే ఆయన అలహాబాదు పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది అలహాబాదులో జరగనున్న కుంభమేళాలోగానే ఈ పేరు మార్పిడి వ్యవహారం మొత్తం పూర్తి అవుతుందట. ఇదేదో ఎవరో ఆకాశ రామన్న చెప్పిన విషయం ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు యూపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య స్వయంగా చేసిన ప్రకటనే సుమా. అయినా మౌర్య ఈ విషయంలో ఏమన్నారన్న విషయానికి వస్తే... అలహాబాదు పేరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని మౌర్య చెప్పారు. అలహాబాద్ వద్ద పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతిలు కలుస్తాయని, ఈ ప్రాంతాన్ని పురాతన కాలం నుంచి ప్రయాగ్‌గా పిలుస్తున్నారని ఆయన చెప్పారు. సో... నెహ్రూ ఊరి పేరు మారిపోతోందన్న మాట.