మోడీ ప్లేస్ లోకి వచ్చేది ఆయనేనట... ?

Update: 2022-03-11 02:30 GMT
బీజేపీ వంటి సిద్ధాంతాలు కలిగిన పార్టీ సైతం ప్రజాకర్షణ మీద ఆధారపడక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ ని విమర్శిస్తూ తమది క్యాడర్ బేస్డ్ పార్టీ అని బీజేపీ ఎపుడూ చెప్పుకుంటూ వస్తోంది. అయితే ఎంత క్యాడర్ ఉన్నా మరెంత సిద్ధాంత బలం ఉన్నా నడిపించే నాయకుడు అయితే కచ్చితంగా కావాలి.

ఆ విధంగా ఒకనాడు వాజ్ పేయి బీజేపీకి పెద్ద దిక్కుగా, గ్లామరస్ ఫిగర్ గా ఉండేవారు. ఆయన తరువాత అద్వానీ కూడా కొంతకాలం బండి లాక్కొచ్చారు. అయితే వారిద్దరూ ఒక పద్ధతిలొనే పాలిటిక్స్ చేశారు. మరీ మాస్ కోసం కొత్త ట్రిక్స్ వాడలేదు. ఆ పని అయితే నరేంద్ర మోడీ చేశారు. అందుకే ఆయన రెండు సార్లు ఆయన దేశానికి ప్రధాని అయ్యారు.

ఇక మూడవసారి ఆయన అవాలని అనుకుంటున్నారు. అయితే ఇపుడు యూపీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన తరువాత బీజేపీలో అంతా యోగీ ఫీవర్ గా సీన్ ఉంది. యోగీ ఆదిత్యనాధ్ కీ జై అంటున్నారు. బీజేపీకి కొత్త ప్రధాని అభ్యర్ధి దొరికేశాడు అని కూడా చాలా మంది మురిసిపోతున్నారు.

నిజానికి దేశానికి యూపీ లాంటి పెద్ద రాష్ట్ర నుంచే ప్రధానులు వస్తారు. ఇపుడు అదే స్టేట్ నుంచి బలమైన జాతీయ పార్టీకి చెందిన పవర్ ఫుల్ నేతగా యోగీ అవతరించారు. ఆయన మరోసారి సీఎం పీఠం అధిరోహించినా కూడా 2024 నాటికి అక్కడ నుంచి ఢిల్లీకి మకాం మారుస్తారా అన్న కొత్త చర్చ అయితే బీజేపీలో గట్టిగా ఉందిట.

ఎందుకంటే మోడీని తప్పించాల్సిన పరిస్థితి వస్తే రీప్లేస్ చేసే నాయకులు లేకనే ఇంతకాలం ఆరెస్సెస్ సహా అంతా కలవరపడ్డారు. ఆ లోటు తీర్చడానికి యోగీ తయారు అంటున్నారు. పైగా దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేసిన అనుభవం కూడా యాడ్ అవుతుంది.

మొత్తానికి చూస్తే యూపీ విజయం బీజేపీలో కొత్త జోష్ తో పాటు కొత్త లీడర్ బెంగను కూడా తీర్చేసింది అంటున్నారు. మరి మోడీ తరువాత తానే పీఎం అని భావిస్తున్నా అమిత్ షా వంటి వారికి ఈ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే అంటున్నారు.
Tags:    

Similar News