ఇక నేల‌పైనే కూర్చుంటున్నాంటున్న సీఎం

Update: 2017-06-03 12:15 GMT
ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఇక నుంచి కిందే కూర్చుంటార‌ట‌. ఎందుకో తెలుసా.. ఇటీవ‌ల ఆయ‌న విలాస‌వంతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, సీఎం ఎక్క‌డ‌కు వెళ్లినా అక్క‌డ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నార‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇటీవల అమరుడైన ఓ బీఎస్‌ ఎఫ్‌ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం యోగి వెళ్లిన సందర్భంగా ఆయన ఇంటిలో ఏసీ - సోఫా - కార్పెట్‌ లను అధికారులు ఏర్పాటు చేయడం... సీఎం ప‌ర్య‌ట‌న ముగిసిన త‌రువాత వాట‌న్నిటినీ అక్క‌డి నుంచి తొల‌గించ‌డం విమర్శలకు తావిచ్చింది.  సీఎం యోగి ఎక్కడికి వెళ్లినా ఇదేవిధంగా అధికారులు విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యోగి  అధికారులకు తాజాగా త‌న నిర్ణ‌యం తెలుపుతూ ఆదేశాలు జారీచేశారు.

రాష్ట్రంలో పర్యటనలు, తనిఖీలు, పథకాల ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు తన కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని అధికారులను ఆదేశాలు జారీచేశారు. 'నా గురించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దు. మామూలు నేల మీద కూర్చునే వ్యక్తుల్లో నేను ఒకడిని' అని సీఎం యోగి అన్నారు. అవ‌స‌ర‌మైతే నేల‌పైనే కూర్చుంటాను కానీ, త‌న కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు మాత్రం చేయొద్ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మ‌రి, అధికారులు  సీఎంను నేల‌పై కూర్చోనిస్తారో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News