ఒక రాజకీయ ప్రయోగం సక్సెస్సో కాదో ఎలా చెబుతాం...? ప్రజలు ఆమోదిస్తే అది విజయవంతమైందని చెప్పుకోవాల్సిందే. తొలుత తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లుగా ప్రచారమైనప్పటికీ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న రెండు నిర్ణయాలకు ప్రజామోదం లభించింది. అత్యంత వివాదాస్పద నిర్ణయాలుగా భావించిన ఆ రెండింటికీ ప్రజల మద్దతు దొరకడంతో యోగిలో ఆత్మవిశ్వాసం రెట్టింపైందట.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న రెండు నిర్ణయాలు ఎంత వివాదస్పదమయ్యాయో అంతే ప్రజామోదం కూడా పొందాయని ఇటీవలి ఒక సర్వే వెల్లడించింది. యూపీ సీఎంగా ఆయన రెండు కీలక నిర్ణయాలను ప్రకటించారు. వాటిలో ఒకటి అక్రమ కబేళాలపై నిషేధం కాగా మరొకటి యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు. ఈ రెండు నిర్ణయాలూ కూడా వివాదాస్పదంగానే మారాయి.
అయితే అదే సమయంలో ఎనలేని ప్రజామోదాన్ని - మద్దతును పొందాయి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా తొలి నెలలో పనితీరుపై నిర్వహించిన సర్వేలో ఆయన పాలనాతీరుకు - పాలనాదక్షతకు - నర్ణయాలకూ 62శాతం మంది ఆమోదం లభించింది. దాదాపు 71శాతం మందికి పైగా ఆయన సరైన దిశలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/