కరోనా రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ సమస్య ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల వెలువడుతున్న కథనాల్లో దీనిపై భయాన్ని ఇంకా పెంచుతున్నాయి. వాస్తవానికి ఇది ఇప్పటిది కాదని... బ్లాక్ ఫంగస్ ఎప్పటినుంచో ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు.
కరోనా బాధితుల్లో మధుమేహంతో బాధపడేవారు కేవలం పది శాతం మాత్రమే. వారిలో వెయ్యిలో ఒక్కరికీ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం లేదు అంటున్నారు నిపుణులు. షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకుంటే దీని నుంచి తప్పించుకోవచ్చుని సూచిస్తున్నారు. గ్లూకో మీటర్ ని ఇంట్లో ఉంచుకొని రోజు పరగడుపున పరీక్ష చేసుకోవాలని అంటున్నారు. తినక ముందు 125 కంటె తక్కువగా ఉండి... అల్పాహారం తిన్న గంట తర్వాత 250 కంటే తక్కువగా ఉంటే మంచిదని చెబుతున్నారు. ఏ1సీ పరీక్ష చేయించుకుంటే మంచిదని పేర్కొన్నారు.
కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల షుగర్ నియంత్రణలోకి రాకుండా బ్లాక్ ఫంగస్ సమస్య ఏర్పడుతోందని వైద్యులు అంటున్నారు. షుగర్ కంట్రోల్ చేయడానికి కొన్నాళ్ల పాటు ఇన్సులిన్ వాడాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే రాగులు, జొన్నలు, కొర్రలు, చిక్కుడు, గోరు చిక్కుడు వంటివి తినాలని చెబుతున్నారు. బియ్యంతో చేసిన పదార్థాలను తగ్గిస్తే మంచిదని సూచించారు.
లక్షల్లో కేసులు ఉంటే బ్లాక్ ఫంగస్ నలుగురు లేదా ఐదుగురికి లేదు. కాబట్టి ఈ సమస్య అందరికీ రాదని వైద్యులు అంటున్నారు. ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ వాడడం, చక్కెర స్థాయి అదుపులో లేకపోవడం వల్లే వస్తుందని చెబుతున్నారు. దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటే బ్లాక్ ఫంగస్ కు చెక్ పెట్టొచ్చని సూచించారు.