ఈ చిన్న ట్రిక్ తో ... వాట్సాప్‌లో డిలీట్ మెసేజ్‌లు చూసేయండి !

Update: 2020-07-07 13:10 GMT
వాట్సాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు. ఇందులో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఉద్యోగం.. ఇలా అన్నింటికీ ఒక్కో వాట్సాప్ గ్రూప్ మైంటైన్ చేస్తున్నారు. అలాగే , . వాట్సప్‌ లో స్టేటస్ పెట్టడం, గంటగంటకు స్టేటస్ అప్‌ డేట్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. కొన్నిసార్లు మెసేజ్‌లు ఎక్కువైపోయి.. ఫోన్ స్పేస్ తగ్గిపోతుంది. అలాంటి తరుణంలో కొన్ని సందేశాలను మనం డిలీట్ చేస్తుంటాం.

అయితే , వాటిల్లో ముఖ్యమైనవి కూడా ఉండవచ్చు.ఆ డిలీట్ మెసేజ్‌లు తిరిగి చూసే వీలుంటే బాగుంటుందని అని అనిపిస్తుంది. అలాంటి డిలీట్ డేటాను ఒక చిన్న ట్రిక్‌ తో తిరిగి చూసే వీలుంది. టెక్స్ట్ మెసేజ్ నుంచి వీడియో, ఫోటో ఏదైనా కూడా చూడొచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

ఇందులో భాగంగా .. మొదటిగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి వాట్సాప్ రిమూవ్ద్ + అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.యాప్ అడిగిన పర్మిషన్లు ఇస్తూనే సెటప్ పూర్తి చేసుకుని అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఏ యాప్‌ను సెలెక్ట్ చేయాలో అడుగుతుంది. వాట్సాప్‌ను ఎంచుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే ఎస్, సేవ్ ఫైల్స్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి.. అల్లోపై క్లిక్ చేయండి. దీనితో గతంలో మీ వాట్సాప్ ‌కు వచ్చిన మెసేజ్‌లన్నీ కూడా వాట్సాప్ రిమూవ్ద్ + యాప్ ‌లో కనిపిస్తాయి. మీరు డిలీట్ చేసిన వాటిని కూడా చూడొచ్చు.
Tags:    

Similar News