వ్యాక్సిన్​ వచ్చేవరకు మాస్కులు పెట్టుకోవాల్సిందే.. సేకండ్​వేవ్​ వస్తే డేంజర్​లో పడ్డట్టే

Update: 2020-10-30 10:00 GMT
కరోనా వైరస్​ ప్రభావం తగ్గిపోయిందని.. కరోనా వచ్చినా తేలిగ్గానే నయమవుతుందని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. త్వరలోనే వ్యాక్సిన్​ వస్తుందని కొన్ని ఫార్మాకంపెనీలు ముమ్మర ప్రచారం మొదలుపెట్టాయి. దీంతో సగటు మనిషిలో కరోనా భయం పూర్తిగా తగ్గిపోయింది. చాలా మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. భౌతికదూరం అన్న సంగతే మరిచిపోయారు. శానిటైజర్ల వాడకం కూడా తగ్గించేశారు. అయితే వ్యాక్సిన్​ వచ్చేవరకు ప్రజలంతా జాగ్రత్తగానే ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం ప్రారంభం అయినందున వైరస్​ ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నదని అందువల్ల ప్రజలు మరికొంతకాలంపాటు అప్రమత్తంగానే ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయింది. మాస్కులు పెట్టుకోవడం మానేశారు. 60 శాతం మంది మాస్కు లేకుండానే తిరుగుతున్నారు. మాస్క్‌ మాయం..భౌతిక దూరం, శుభ్రతకు చెల్లు.. వ్యాక్సిన్‌ వస్తుందని రక్షణ చర్యలు గాలికి వదిలేయడం వల్ల దేశం మరో దశ కరోనా వ్యాప్తి బారిన పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాక్సిన్​ వచ్చేస్తోందా?

వ్యాక్సిన్​ ఈ తేదీలోగా వచ్చేస్తుందని పలు కంపెనీలు, రాజకీయనాయకులు ప్రకటనలు గుప్తిస్తున్నప్పటికీ అది అంత తేలికైన పనికాదని కొందరు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  అందువల్ల టీకాపై ధీమాతో నిర్లక్ష్యంగా ఉండడం సరికాదని సూచిస్తున్నారు. ఎప్పటిలాగే మాస్కు ధారణ, భౌతికదూరం పాటించాలని కోరుతున్నారు.   వైరస్​ను నుంచి కాపాడుకొనేందుకు రోగనిరోధకశక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరానికి విటమిన్‌–డి చాలా అవసరం. విటమిన్‌–డి శరీరంలో శోషణ కావాలంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, సెలీనియం ఉండే పదార్థాలు తీసుకోవాలి అని వైద్య నిపుణులు  చెబుతున్నారు.
Tags:    

Similar News