మీరు మీ ‘జగన్ రెడ్డి’ కోసం పనిచేశారు..మీకు మేం పదవులు ఇవ్వం: ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు
ఎన్నో కష్టాలను ఓర్చుకొని.. వైసీపీ జెండా పట్టుకొని.. జగన్ కోసం జేజేలు కొట్టారు వాళ్లు.. టీడీపీ అధికారంలో ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై జగన్ అంటూ.. జగన్ కోసం అహర్నిషలు శ్రమించి.. జగనన్న సీఎం అయ్యేదాకా నిద్రపోమని ఒళ్లు గుళ్ల చేసుకున్నారు.. అయితే అలాంటి జగన్ అభిమానులను నేడు పట్టించుకునేవారు కరువయ్యారు.. జగన్ కోసం శ్రమించిన వాళ్లకు జగన్ అధికారంలో ఉన్నా కష్టాలు తప్పడం లేదట. ఇన్నాళ్లు రెక్కలు ముక్కలు చేసుకున్న వారికి సరైన న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. అదీకాగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ‘చీ.. పో..’ అంటూ దూరం పెడుతున్న తీరు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలోని ప్రకాశం జిల్లా వైసీపీకి పెట్టని కోటలా ఉంటుంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇక్కడి వైసీపీ నేతలు జగన్ అధికారంలో రావడానికి ఎంతో శ్రమించారు. జగన్ సీఎం కావడమే లక్ష్యంగా పెట్టుకొని వైసీపీ కోసం నిద్రాహారాలు మాని ప్రచారం చేశారు. దీంతో వారి శ్రమ ఫలించింది. అనుకున్నట్లుగా ఇక్కడ వైసీపీ జెండా రెపరెపలాడింది.
అయితే జగన్ అధికారంలో ఉన్నా అప్పుడు శ్రమించిన వారికి న్యాయం జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల పార్టీకి చెందిన ఓ నేత ఎమ్మెల్యేను కలువగా ‘మీరు జగన్ మనుషులు.. మీకు ఏ పదవి కావాలంటే డైరెక్టుగా జగన్ ను అడగండి.. మీకు మేం పదువులు ఇవ్వం’అని జిల్లాలోని ఓ ఎమ్మెల్యే మోహమాటం లేకుండా చెప్పేశాడట. ఇక మరో ఎమ్మెల్యే ‘మీరు జగన్ పార్టీ వెంటే ఉంటారు.. కానీ మాతోని ఉండే నాయకులు కాదు.. మేం ఏ పార్టీకి వెళ్లినా.. మా వాళ్లు మాతోనే వస్తారు..అందువల్ల మీకు పదవులు ఇచ్చేది లేదు’ అని వైసీపీ కోసం అనాదిగా కష్టపడుతున్న నేతల మొఖం మీదే అన్నారట.
ఎమ్మెల్యేలతో ఇబ్బందులకు గురైన వారంతా ఈ విషయంపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారట. అయితే మార్కపురం నియోజకవర్గానికి చెందిన ఓ నేత ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లే సరికి ఎమ్మెల్యేలు ఉన్నారట. అందువల్ల ఫిర్యాదు చేయలేకపోయారట. ఈ విషయం బయటికి రావడంతో పెద్ద ఎత్తున్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేల ప్రవర్తన ఇలాగే ఉంటే వైసీపీకి చెందిన నిజమైన నాయకులకు న్యాయం జరిగే అవకాశం లేదని కొందరు చర్చించుకుంటున్నారు.