చూసినంతనే బాగా చదువుకున్న వారితో పాటు.. సంపన్నులుగా కనిపించే ఒక యువ జంట మాయమాటలు చెప్పి.. పలువురు విద్యార్థుల జీవితాల్ని నాశనం చేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది. అమెరికాలోని తెలుగు విద్యార్థులకు దారుణంగా మోసగించిన వీరు.. దాదాపు రూ.10కోట్ల మొత్తాన్ని వసూలు చేసి పరారు అయినట్లుగా చెబుతున్నారు. వీరిద్దరిని సునీల్.. ప్రణీతలుగా చెబుతున్నారు.
అమెరికాలో ఎఫ్1 వీసాలు ఉన్న విద్యార్థులకు హెచ్ 1 వీసాలు ఇప్పిస్తామని భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి వద్ద నుంచి 25వేల డాలర్లు వసూలు చేశారు. చివరకు పత్తా లేకుండా పారిపోయారు. దీంతో బాధితులుగా మారిన 30 మంది తెలుగు విద్యార్థులు నార్త్ కరోలినా హోం ల్యాండ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో స్పందించిన వారు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
తప్పుడు హామీలు ఇచ్చి.. లేనిపోని ఆశలు కల్పించి భారీగా డబ్బులు గుంజేసిన ఈ జంట.. తాము వసూలు చేసిన డబ్బుల్ని తన తండ్రి అకౌంట్ కు బదిలీ చేసినట్లు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉండే ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. అతను కూడా పరారీ అయినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం వీరిని పట్టుకోవటం కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు.