పిల్లికి ఉరి వేసి టిక్ టాక్ వీడియో..తర్వాత ఏమైందంటే!

Update: 2020-05-23 07:10 GMT
టిక్ టాక్ ..టిక్ టాక్ ..ప్రస్తుతం దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం లాక్ డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో ఈ టిక్ టాక్ లో వీడియో లు చేసేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే ఓ ఇంటర్ విద్యార్థి టిక్ టాక్ పిచ్చితో ఏం చెయ్యాలో దిక్కుతోచక ఓ పిల్లిని హత్య చేశాడు. తర్వాత ఆ పిల్లి మెడకు ఉరి వేసి వేలాడదీసి టిక్ టాక్ వీడియో తీశాడు. ఆ వీడియో వైరల్ అయితే, టిక్ టాక్ లో ఫెమస్ అవుతానని అనుకున్నాడు..కానీ , ఆ ప్రయత్నం తిరగబెట్టి ప్రస్తుతం జైలు గోడల మధ్య ఊసలు లెక్క పెట్టుతున్నాడు. దీనిపై పూర్తి వివరాలు చూస్తే..?

తమిళనాడులోని నెల్ లై జిల్లా పనడుడి సమీపంలోని శెట్టికులం సత్యనగర్ లో తంగరాజ్   అనే 19 ఏళ్ల యువకుడు ఉన్నాడు. తంగరాజ్ ఇంటర్ పూర్తిచేసాడు.కానీ , ప్రస్తుతం వైరస్ మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ అమలు కావడంతో విద్యా సంస్థలు మూసివేయడంతో తంగరాజ్ ఇంట్లోనే ఉంటున్నాడు. కాలేజ్ లో స్నేహితులతో కలిసి టిక్ టాక్ వీడియోలు తీసిన తంగరాజ్ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా స్నేహితులు ఎవ్వరూ అందుబాటు లో లేక పోవడంతో ఎదైనా కొత్తగా టిక్ టాక్ వీడియో తియ్యాలని అనుకున్నాడు.

దీనితో ఇంటి దగ్గర ఖాళీగా తిరుగుతున్న తంగరాజ్ కు ఓ పిల్లి కనపడింది. అంతే ఆ పిల్లిని పట్టుకుని  చంపి, ఓ తాడు తీసుకుని దాని మెడకు ఉరి వేసి వేలాడదీశాడు. ఉరి వేసిన పిల్లతో ఓ టిక్ టాక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో అనుకున్నట్టే వైరల్ అయ్యింది. అయితే, పిల్లిని చంపి దానికి ఉరివేసి టిక్ టాక్ వీడియో తీశాడని తెలుసుకున్న అనేక మంది నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిక్ టాక్ వీడియో ఆధారంగా విచారణ చేసిన పోలీసులు, అటవి శాఖ అధికారులు తంగరాజ్ ను పట్టుకుని బెండ్ తీసి కేసు నమోదు చేశారు. ఒక్క వీడియో తో టిక్ టాక్ లో స్టార్ గా మారాలన్న ఈ యువకుడు  ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.
Tags:    

Similar News