‘జనతా గ్యారేజ్ .. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఫేమస్. అంతేకాదు ఆ మూవీ కూడా హిట్ అయ్యింది. అలాంటి ఓ సమస్యలు పరిష్కరించే గ్యారేజ్ ఉంటే ఎంత బావుండును అని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా ప్రభావమో.. ఫోకస్ కావాలనే ప్రయత్నమో కానీ ఓ నవ్యాంధ్ర యువకుడు ఎన్టీఆర్ లా అవతారమెత్తాడు.. నవ్యాంధ్రలో ఓ కొత్త జనతా గ్యారేజ్ తెరిచానని.. సమస్యలున్న వారు తనను సంప్రదిస్తే పరిష్కరిస్తానని చెప్పుకొచ్చాడు. ఓ వాట్సాప్ గ్రూపు పెట్టి సమస్యలు చెప్పండంటూ కోరాడు.
అంతేకాదు.. నమ్మకం కలిగేలా ఓ కత్తిని పట్టుకొని హల్ చల్ చేస్తూ ఏపీ రాజధాని అమరావతి నడిబొడ్డున తాడేపల్లి ఉండవల్లి సెంటర్ లో విచ్చు కత్తితో వీరంగం సృష్టించాడు. ‘నా దగ్గరికి రా.. క్షణాల్లో సమస్య పరిష్కరిస్తా’ అంటూ కేకలు వేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ యువకుడు ఫోన్ లో మాట్లాడుతూ గట్టిగా అరుస్తూ కత్తితో అటూ ఇటూ సాము చేశాడు.
యువకుడి హల్ చల్ చూసి జనాలు భయపడి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. యువకుడి పేరు ప్రదీప్ గా తేల్చారు. గ్రూపులో ఉన్న మిగతా వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. కొత్త రాజధానిలో ఇలా నేరస్థుల అడ్డాగా మారుతోందని.. చాలా మంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Full View