ప్రేమ .. మోసం . ప్రస్తుత సమాజంలో ఇదే జరిగేది. ప్రేమించడం , ఆ తర్వాత మోసపోవడం. అయితే ప్రేమలో మోసపోయేది ఎక్కువగా అమ్మాయిలే. ఓ అమ్మాయిని ప్రేమించడం మోసం చేయడం తమ పని ముగిసిన తర్వాత పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిలని ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ,, అమ్మాయి తన ప్రేమని ఒప్పుకోలేదని లవర్ పై యాసిడ్ దాడి చేసిన ప్రేమికుడు అంటూ వచ్చిన ఎన్నో వార్తలు మనం చూసాం. కానీ, ఇది దానికి కొంచెం రివర్స్ , అమ్మాయిలు కూడా తిరగబడుతున్నారు అనేదానికి ఉదాహరణ. తనని ప్రేమించి , మోసం చేసి మరో అమ్మాయి చేయి పద్దుకోవడానికి సిద్దమైన అబ్బాయి పై యాసిడ్ దాడి చేసింది ఓ యువతి. ఈ ఘటనలో 28 ఏళ్ల యువకుడు మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే .. ఉత్తరప్రదేశ్ లో ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్పై యాసిడ్ దాడి చేసింది. ఆగ్రాలోని హరిపర్వత్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిన ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ పై యాసిడ్ దాడి చేసింది. తీవ్రంగా శరీరం కాలడంతో.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం ప్రైవేలు ల్యాబ్ లో పనిచేస్తున్న ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఓ కిరాయి ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే అబ్బాయి తల్లితండ్రులు మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అతని ప్రేయసి ఆగ్రహనికి గురైంది. సీలింగ్ ఫ్యాన్ ను రిపేర్ చేయాలంటూ బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి రమ్మన్న ఆ యువతి బాయ్ ఫ్రెండ్ పై కోపంతో యాసిడ్ చల్లింది. బాయ్ ఫ్రెండ్ పై యాసిడ్ చల్లిన ఆమె కూడా స్వల్పంగా గాయపడింది. హాస్పిటల్ లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నది. యువతి తన కుమారుడిపై యాసిడ్ దాడి చేసి చంపేసినట్లు అతని పేరెంట్స్ ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.