బీఎఫ్ ని కలవాలి NOC ఇవ్వండి అని బంజారా హిల్స్ లో కేసు!

Update: 2020-04-07 05:10 GMT
కరోనాతో అంతా లాక్ డౌన్ అయ్యింది.. జనాలందరినీ ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టవద్దని సూచించారు. ఎవరైనా అతిక్రమించి రోడ్డెక్కితే పోలీసులు ముడ్డి పగులకొడుతున్నారు. వాయించేస్తున్నారు. ఇప్పటికే ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో నిత్యావసరాలు - ఏదైనా ఆపతికాలం చావులు - ప్రమాదాలు వాటిల్లితే.. చిక్కుకుపోతే పోలీసుల అనుమతితో రోడ్డెక్కుతున్నారు. కానీ ఓ యువతి మాత్రం వింత కోరికతో పోలీసులను ఆశ్రయించిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఇదిప్పుడు వైరల్ గా మారింది.

తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఓ వింత కేసు వచ్చింది. ఓ యువతి తన బ్యాయ్ ఫ్రెండ్ ను చూడాలని ఉందని.. అతడి దగ్గరకు వెళ్లడానికి అనుమతివ్వాలని  పోలీసులను కోరింది. ఆ కోరిక విని పోలీసులంతా షాక్ అయ్యారు. ఇంత లాక్ డౌన్ వేళ ఇదేం కోరిక అని ముక్కున వేలేసుకున్నారు. తనను వెళ్లనిచ్చేదాకి పోలీస్ స్టేషన్ వదలనని స్టేషన్ లో భైటాయించింది.

నిజానికి ఈమె ప్రేమిస్తున్న అంబర్ పేటకు చెందిన యువకుడు ఆదివారం యువతి ఇంటికొచ్చి ఈమెను చూడడానికి ప్రయత్నించాడు. యువతి తల్లిదండ్రులు - స్థానికులు కొట్టడానికి రావడంతో పారిపోయాడు.  అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు యువకుడిని పిలిపించగా.. యువతి మీద తనకు ఎలాంటి ప్రేమ లేదని.. అది చెప్పడానికే వచ్చానని తెలిపి కేసు నుంచి తప్పించుకున్నాడు.

అయితే యువకుడు వదిలినా.. ఆ యువతి మాత్రం అతడిని వదిలేలా కనిపించడం లేదు. తాజాగా పోలీస్ స్టేషన్ కు వచ్చి యువకుడిని కలవాలని ఉందని కోరింది. మరి ఈ కేసు విరహ ప్రేమ జంట సమస్యను పోలీసులు ఎలా పరిష్కరిస్తారన్నది తెలియకుండా ఉంది. ప్రస్తుతానికి సర్ధి చెప్పి పంపించారట..
Tags:    

Similar News