ఆ రైళ్లలో టికెట్ కన్ఫర్మ్ కాకుంటే ఫ్లైట్ జర్నీ

Update: 2016-05-26 22:30 GMT
వినూత్న విధానాలతో దూసుకెళుతున్న భారతీయ రైల్వే తాజాగా సరికొత్త ఆఫర్ ను తెర మీదకు తీసుకొచ్చింది. రాజధాని రైళ్లలో టికెట్ బుక్ చేసుకొని.. చివరి క్షణం వరకూ కన్ఫర్మ్ కాని ప్రయాణికుల కోసం సరికొత్త ఆఫర్ ను రైల్వేశాఖ ప్రకటించింది. రాజధాని ప్రయాణం కోసం టికెట్ కన్ఫర్మ్ కాలేదన్న చింత అక్కర్లేదని.. ఆ ప్రయాణ సమయానికి కాసిన్ని డబ్బులు అదనంగా చెల్లిస్తే చాలు.. ఏకంగా ఫ్లైట్ జర్నీ చేసే అవకాశాన్ని కల్పించనుంది. ఈ తాజా ఆఫర్ ను వారం రోజుల్లో షురూ చేయనున్నారు.

రైల్వే శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో రాజధాని ట్రైన్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు రిజర్వేషన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉందన్న చింత ఇకపై ఉండనట్లేనని చెప్పక తప్పదు. ఇందుకు సంబంధించిన ఒప్పందం ఐఆర్ సీటీసీ.. ఎయిర్ ఇండియా మధ్య తాజాగా జరిగింది. రాజధాని రైళ్లలో ఫస్ట్ క్లాస్ కు రిజర్వేషన్  చేసుకున్న వారు విమాన ప్రయాణానికి అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిగిలిన తరగతుల వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు మాత్రం.. ఫ్లైట్ జర్నీ కోసం దాదాపు రూ.2వేల వరకూ అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు ఎలాంటి ఆందోళనలు పడాల్సిన అవసరం ఇక ఉండదనే చెప్పాలి.
Tags:    

Similar News