మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం తప్పేమీ కాకపోయినా... తన ప్రతిపాదనను తిరస్కరించే బాలికలు - యువతులపై కొందరు దుర్మార్గులు పాల్పడుతున్న అకృత్యాలు వింటేనే ఒళ్లు జలదరించక మానదు. కొన్ని ఘటనల్లో అభం శుభం తెలియని అమ్మాయిలు ప్రాణాలు సైతం కోల్పోయిన వైనం మనలను ఇప్పటికీ భయభ్రాంతులకు గురి చేస్తున్నదే. అమ్మాయిలపై దాడులకు పాల్పడే ఆకతాయిలకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం ఎంత కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా... ఇప్పటికీ అమ్మాయిలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్న వైనం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఓ ఆకతాయి యువకుడు తన ప్రేమను తిరస్కరించిందనే నెపంలో ఓ బాలికపై ఇష్టారాజ్యంగా దాడికి దిగాడు. అది కూడా నలుగురూ తిరిగే బహిరంగ ప్రదేశంలోనే సుమా.
అయితే ఈ ఘటనలో ఓ ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. అదేంటంటే... తన ప్రేమను తిరస్కరించిన సదరు బాలికపై దాడి చేసిన ఆ ఆకతాయి... అటుగా మరో మహిళ రాగానే సెట్ రైట్ అయిపోయాడు. తనది తప్పేనని, తనను క్షమించాలని ప్రాధేయపడుతూ... చివరికి ఆ బాలిక కాళ్లు పట్టుకున్నాడు. అయితే ఆ ఆకతాయి చేష్టలకు బెంబేలెత్తిపోయిన ఆ బాలిక అతడి ప్రతిపాదనకు ససేమిరా అనడమే కాకుండా... తనపై దాడి జరుగుతుండగా అక్కడికి వచ్చిన మహిళ వెంట వెళ్లిపోయింది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే... ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ నగరంలో. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో పూర్తిగా రికార్డు కాగా... ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే... ఓ స్నేహితురాలితో కలిసి బాలిక ఓ ప్రదేశానికి స్కూటర్ పై వచ్చి పార్కింగ్ ప్రదేశంలో వాహనం పార్క్ చేస్తుండగా ఎంటరైపోయిన ఆకతాయి... తన ప్రేమ సంగతి ఏం చేశావని ప్రశ్నించాడు. అందుకు ఆ బాలిక తిరస్కారమే తన సమాధానమంటూ నో చెప్పేసింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆ ఆకతాయి... చేయితో ఆ బాలికను చెడామడా చెంపై వాయించేశాడు. ఇద్దరు పోట్లాడుకునే ఫైటింగ్ లో మాదిరిగా అతడు బాలిక చెంపపై బాగా బలంగానే కొట్టాడు. ఈ హఠాత్పరిణామంలో బాధితురాలి వెంట వచ్చిన స్నేహితురాలు అతడిని అడ్డుకునే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఈ తతంగం జరుగుతుండగానే అక్కడికి మరో మహిళ స్కూటర్ పై వచ్చింది. ఆ మహిళను చూడగానే... ఆకతాయి చేష్టలుడిగిపోయాయి.
ఏం చేయాలో పాలుపోని వాడిలా దిక్కులు చూసిన అతడు... ఆ తర్వాత తనది తప్పయిందని, తనను మన్నించాలని బాధితురాలిని వేడుకున్నాడు. చేతులు పట్టుకున్నాడు. గడ్డం పట్టుకున్నాడు. అయినా బాలిక ససేమిరా అనడంతో... చేసేదేమి లేక చివరికి కాళ్లు కూడా పట్టేసుకున్నాడు. అయినా ఆ ఆకతాయిని క్షమించేందుకు బాధితురాలు ససేమిరా అంది. ఈ తతంగాన్నంతా పరిశీలించిన మహిళ... తాను వెళుతూ బాధితురాలని తన వెంట తీసుకెళ్లేందుకు యత్నించింది. అయితే ఈ యత్నాన్ని అడ్డుకోబోయిన ఆకతాయి... రెండో పర్యాయం ఆ మహిళ మరింత ముందుకు వచ్చి బాధితురాలి చేతిని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోగా... ఆకతాయి మాత్రం చేష్టలుడిగిన వాడిలా అలా చూస్తూ ఉండిపోయాడు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/