టాప్.. స్కర్టు ధరించిందని మహిళపై యువకుల దాడి.. వీడియో వైరల్..!

Update: 2023-01-05 16:19 GMT
20వ శతాబ్దంలో మహిళలు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా వాటి ఫలితం మాత్రం శూన్యంగానే మిగులుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ముస్లిం దేశాలు మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు అత్యంత అమానుషంగా ఉంటుంది. తాజాగా ఇరాన్ లో ఓ టీనేజ్ యువతి పట్ల అక్కడి యువకులు వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ముస్లిం మహిళల పట్ల సంప్రదాయాల పేరుతో కొందరు మత చాందసవాదులు వారిని వంటింటికే పరిమితం చేస్తున్నారు. మహిళలను కేవలం పిల్లలు కనే మిషన్లు గాను.. అంగట్లో ఆటబొమ్మలుగా చూస్తున్నారు. కనీసం స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి కూడా కొన్ని దేశాల్లో లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఇరాక్.. ఇరాన్.. సిరియా.. ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మహిళల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నాయి.

ముస్లిం మహిళలు హిజాబ్ కాదని.. వెస్ట్రన్ దుస్తులు ధరిస్తే ఇక వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ కింది వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇరాక్ లో ఓ టీనేజీ యువతి టాప్.. స్కర్టు ధరించిందని 16 మంది యువకులు వెంబడించి మరీ దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..!

ఇరాక్ కు చెందిన ఓ 17 ఏళ్ల యువతి 2022 డిసెంబర్ 30న కుర్ధిస్థాన్ ప్రాంతంలో జరుగుతున్న బైక్ రేసింగ్ చూడటానికి వెళ్లింది. అయితే ఈ పోటీ పాల్గొన్న పురుషుల దృష్టిని మరల్చేందుకే ఆ యువతి టాప్.. స్కర్టు ధరించిన డ్రెస్సును వేసుకొని వచ్చిందంటూ ఆరోపిస్తూ పలువురు యువకులు ఆమెపై దాడికి దిగారు. ఆ యువతిని కాపాడేందుకు ఆమె స్నేహితుడు ప్రయత్నించగా అతడిని ఆ యువకులు తీవ్రంగా కొట్టడమే కాకుండా కత్తితో పొడిచారు.

ఈ వీడియోలో పురుషులు ఆ యువతి చుట్టూ చేరి అరవడం కన్పిస్తోంది. బైక్ రేసర్లు ఆమెను చుట్టూ ముట్టినట్లు కన్పిస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో యువతిపై దాడి చేసిన 16 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కత్తులు.. కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై మీ రియాక్షన్ ఏంటో కింద మాతో పంచుకోండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull View
Tags:    

Similar News