హైదరాబాద్ మహానగరంలో క్రైం రేటు అంతకంతకూ పెరుగుతోంది. కారణం ఏమైనా కానీ.. ప్లాన్ చేసి మరీ దాడి చేయటం.. తాము అనుకున్న టార్గెట్ ను చంపేసే ప్రయత్నంలో సక్సెస్ కావటం ఈ మధ్యన పెరుగుతోంది. ఇటీవల కాలంలోనే ఇలాంటి ఘటనలు సిటీలో చోటు చేసుకున్నాయి.
టార్గెట్ చేసినోడు తాను అనుకున్నట్లుగా చంపే తీరుకు భిన్నమైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారులో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..
ఒక వివాహేతర సంబంధం కాస్తా దారుణమైన క్రైమ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. యాప్రాల్ కు చెందిన విక్కీ అలియాస్ చిన్నారెడ్డి.. కృష్ణ.. జోసఫ్.. వికాస్ కుమార్ లకు అదే ప్రాంతానికి చెందిన శ్రావణ్ అనే వ్యక్తికి మధ్య గడిచిన కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీటన్నింటికి ఒక వివాహేతర సంబంధమే కారణంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. శ్రావణ్ ఇంటిపై దాడి చేసి.. అతడ్ని హతమార్చాలని ప్లాన్ చేసుకున్న నలుగురు అతడి ఇంటికి వెళ్లారు.
ఇలాంటి ఉదంతాల్లో ప్లాన్ చేసుకున్న వారు చెలరేగిపోవటం.. దాడికి గురైన వారు డిఫెన్స్ లో ఉండటం మామూలే. కానీ.. తాజా ఉదంతంలో సీన్ రివర్స్ అయ్యింది. తనపై కత్తులతో దాడి చేస్తున్న నలుగురిపై శ్రావణ్ తిరగబడ్డాడు. తిరిగి కత్తితో వారిపై ప్రతిదాడికి దిగాడు.
ఈ దాడిలో తనపై దాడికి వచ్చిన వారిలో విక్కీ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. వికాస్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వీరిని యశోద ఆసుపత్రికి తరలించారు. తనపై దాడికి ప్లాన్ చేసిన వారిలో ఒకరిని హతమార్చిన శ్రవణ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.