తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి మంచి స్పీడులోనే సాగుతున్నారు. వాస్తవానికి రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు దఖలు పడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఓ రేంజిలో జోష్ కనిపిస్తున్న మాట వాస్తవమే. పార్టీని వీడిన నేతలు కూడా రేవంత్ దూకుడును చూసి తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి. అందుకు రేవంతుడే కారణమని కూడా చెప్పాలి. వరుసపెట్టి బహిరంగ సభలను నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. రేవంతుడి స్పీచ్ లకు భారీ అప్లాజ్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు రేవంత్ సరికొత్త రీతిలో సంచలన ప్రసంగం చేశారు.
రేవంత్ నుంచి వచ్చిన సంచలన కామెంట్లు ఏమిటన్న విషయానికి వస్తే.. ''కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది నాయకులను తయారు చేసింది. చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారే. వైయస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలను యూత్ కాంగ్రెస్ అందించింది. ఆ ముగ్గురు నేతల మాదిరి నేతలను మనం తయారు చేయలేమా?'' అని రేవంత్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇటు వైఎస్సార్ అయినా, అటు కేసీఆర్, చంద్రబాబు అయినా.. ముగ్గురూ కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. అయితే వైఎస్సార్ తన మరణం వరకూ పార్టీలోనే కొనసాగితే.. చంద్రబాబు, కేసీఆర్ లు మాత్రం వేరే పార్టీల్లో కొనసాగుతున్నారు. వీరి తరహాలోనే కాంగ్రెస్ పార్టీ శక్తివంతమైన నేతలను రూపొందిస్తుందని, ఆ సత్తా పార్టీకి ఉందని కూడా రేవంత్ చెప్పుకొచ్చారు.
ఇక 2023లో తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలపైనా రేవంత్ ఇప్పటికే ఫుల్ క్లారిటీతో ఉన్నట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. 2023 ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఎలాంటి వారికి ఇస్తామన్న విషయాన్ని కూడా రేవంత్ ఇప్పుడే చెప్పేశారు. ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలకు టికెట్లు కేటాయించాలంటే.. ముందు వారు ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏ మేర కొట్లాడారో చూస్తామని రేవంత్ అన్నారు. టికెట్ తీసుకుని జనాల్లోకి వెళ్తామని భావించేవాళ్లు గెలవలేరని కూడా ఆయన తేల్చేశారు. కష్టపడి పని చేసేవారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఎవరు కష్టపడితే వాళ్లే కాంగ్రెస్ పార్టీకి ఓనర్స్ అని తెలిపారు. కష్టపడి పని చేయడానికి నేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడితే ఇంటికే వచ్చి బీఫామ్ అందిస్తానని రేవంత్ చెప్పారు. రానున్న 20 నెలల్లో కష్టపడినదాన్ని బట్టి టికెట్లు ఇస్తామని తెలిపారు. నేను పీసీసీ చీఫ్, నేను జిల్లా అధ్యక్షుడిని అని అడిగితే టికెట్లు ఇవ్వబోమని.. పనిచేసే వాళ్లే టికెట్లు అడగాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉందని.. సంక్షోభ సమయంలోనే నాయకులు పుట్టుకొస్తారని రేవంత్ రెడ్డి తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.