సోషల్ మీడియా చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. దీంతో.. కొత్త తరహా బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు కొందరు. నకిలీ ఫోటోలతో.. మార్ఫింగ్ ఫోటోలతో మహిళల్ని వేధించటం తెలిసిందే. ఇప్పుడు వారి కన్ను నేతల మీద పడింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద అసభ్యకర వ్యాఖ్యలు.. ఇబ్బంది పెట్టే వీడియోల్ని తయారు చేయటం.. వాటిని డిలీట్ చేయాలంటూ తమకు పెద్ద మొత్తం కావాలంటూ చేస్తున్న బ్లాక్ మెయిల్ ఉదంతం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో బాధితుడిగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై అభ్యంతరకర రీతిలో పోస్టుల పెడుతున్నాడో యువకుడు.కేపీహెచ్ బీ కాలనీకి చెందిన గోపాల్ అనే వ్యక్తి ఈ తరహా పోస్టులు పెడుతున్నట్లుగా గుర్తించారు. ఎమ్మెల్యే ఇమేజ్ ను ఎందుకిలా ఖరాబు చేస్తావన్న ప్రశ్నకు.. తనకు రూ.10లక్షలు ఇస్తే పోస్టులు పెట్టటం మానేస్తాని చెప్పటంతో ఎమ్మెల్యే వర్గీయులు షాక్ తిన్నారు.
చివరకు ఎమ్మెల్యే సూచనతో పోలీసులకు ఈ అంశంపై సమాచారం అందించారు. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల వేళ.. నాయకుల్ని లక్ష్యంగా చేసుకొని వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా చేస్తే పెద్ద ఎత్తున డబ్బు సంపాదించొచ్చన్న ఆలోచనతో ఇలాంటివి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.