తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఏర్పడింది. గడిచిన 30 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలను ఏలిన మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధిలు ఇటీవలే కన్నుమూశారు. దీంతో అంతటి దిగ్గజ నాయకుల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నాయకులను భర్తీ చేసే నాయకులు ఇప్పుడు ఆయా పార్టీలకు కరువయ్యారు.అందుకే కొత్తగా తమిళ రాజకీయాల్లోకి దూసుకురావడానికి ఇద్దరు అగ్రహీరోలు ముందుకొచ్చారు.
రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడమా.. వెనకడుగు వేయడమా అని తటపటాయిస్తున్న సమయంలోనే మరో స్టార్ హీరో కమల్ హాసన్ మాత్రం ఏకంగా పార్టీ పెట్టి అధికార అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలను చెడుగుడు ఆడేస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పదునైన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు . కమల్ విమర్శలను అధికార అన్నాడీఎంకే నేతలు సహించలేకపోతున్నారు. పలుమార్లు కమల్ ను హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలోనే కమల్ టార్గెట్ గా అధికార పార్టీ దారుణాలకు ఒడిగడుతుందా అన్న అనుమానాలు తాజా పరిణామాలతో చోటుచేసుకున్నాయి.
తాజాగా చెన్నైలోని ఆళ్వార్ పేట ఎల్డామ్స్ రోడ్డులో ఉండే కమల్ హాసన్ ఇంటిలోకి వరుసగా ఇద్దరు చొరబడ్డారు. కమల్ హాసన్ తన ఇంటిలోని ముందు భాగాన్ని పార్టీ కార్యాలయంగా మార్చారు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం సెక్యూరిటీ కల్లుగప్పి ఓ వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించగా.. అతడిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మంగళవారం తెల్లవారుజామున మరో ఆగంతుకుడు కమల్ ఇంట్లోకి ప్రవేశించి దొరికిపోయాడు. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ ను చంపేందుకు కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై తమిళనాట దుమారం రేగుతోంది.