ఏపీ అధికారపక్షంపై అంతకంతకూ పెరుగుతున్న కోపం ఎక్కడి వరకూ వెళుతుందో చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించక మానదు. తాజాగా ఏపీకి చెందిన ఒక కుర్రాడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి కోరిన కోరిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో యమా హుషారుగా ఉండే కేటీఆర్ ను.. తాజాగా విజయనగరం జిల్లా గరివిడికి చెందిన కెల్లా శివకుమార్ అనే యువకుడు ఊహించని కోరికను కోరాడు.
ఏపీ రాజకీయాలతో విసిగిపోయామని.. ఏపీలో టీఆర్ ఎస్ శాఖను ఏర్పాటు చేయాలని కోరాడు. దీనికి రియాక్ట్ అయిన కేటీఆర్.. తెలంగాణలో తాము చేయాల్సింది చాలానే ఉందని.. మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ తనదైన స్టైల్లో స్పందించారు. గతంలో పలుమార్లు ఏపీకి టీఆర్ ఎస్ కు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారని.. తాను భీమవరం నుంచి పోటీ చేస్తానంటూ సరదాగా కేటీఆర్ జోక్ చేయటం మర్చిపోకూడదు.
ఈ మధ్యన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలిలో బర్త్‌డే వేడుకలు నిర్వహించిన వైనాన్ని అందరూ మాట్లాడుకునేలా చేసింది. అంతేనా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే.. తాను తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లిస్తానని మొక్కుకున్న నేపథ్యంలో.. ఈ మధ్యనే తన మొక్కును చెల్లించేందుకు తిరుమలకు వచ్చిన కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు.. బ్యానర్లు ఏర్పాటు చేయటాన్ని మర్చిపోకూడదు.
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ ప్రసంగానికి భారీ స్పందన రావటం.. ఆయన మాటలు వినేందుకు ఏపీ ప్రజలు ఉత్సాహాన్ని ప్రదర్శించటం అప్పట్లో పెద్ద వార్తగా మారింది. ఇలా.. కేసీఆర్ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శించే ఏపీ ప్రజలు.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి.. పార్టీ శాఖను ఏర్పాటు చేస్తారా? అంటూ ట్వీట్ చేయటం ఇప్పుడు విశేషంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/