ఆ వీడియోల తొల‌గింపున‌కు 10 వేల సిబ్బంది!

Update: 2017-12-05 10:45 GMT
ఈ ఇంట‌ర్నెట్ జ‌మానాలో చౌక ధ‌ర‌కే స్మార్ట్ ఫోన్లు - కంప్యూట‌ర్లు....అతి తక్కువ ధ‌ర‌కే ఇంట‌ర్నెట్ సేవ‌లు ల‌భిస్తున్నాయి. దీంతో, యూట్యూబ్ ను వీక్షించే వారి సంఖ్య గ‌తంలో కంటే పెరిగింది. అయితే, కొంత‌మంది ఈ సౌక‌ర్యాల‌ను విజ్ఞానానికి వినియోగిస్తుంటే....మ‌రికొంద‌రు వినాశ‌నాన‌నికి వాడుతున్నారు. యూట్యూబ్ లో హింస‌ను ప్రేరేపించే, ఉగ్ర‌వాదానికి సంబంధించిన, అశ్లీల వీడియోలు విచ్చ‌ల‌విడిగా ల‌భ్య‌మ‌వుతున్నాయి. వాటిని చూసిన యువ‌త పెడ‌దోవ‌ప‌డుతోంది. అయితే, దీనికి చెక్ పెట్టేందుకు యూట్యూబ్ మ‌రిన్న ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. 2018 నాటికి ఆ త‌ర‌హా కంటెంట్ నుంచి  యూట్యూబ్ ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు దాదాపు 10000 మంది సిబ్బందిని నియ‌మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

యూట్యూబ్ లో ల‌భిస్తోన్న ఉగ్రవాద వీడియోలు చూడ‌డం వ‌ల్లే త‌మ దేశంలో ఉగ్ర‌దాడులు పెరిగాయ‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని థెరెసా మే...అక్టోబ‌ర్ నెల‌లో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అటువంటి స‌మాచారాన్ని ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, యూట్యూబ్ తో స‌హా ఇత‌ర సామాజిక మాధ్య‌మాల్లో నుంచి తొల‌గించాల‌ని ఆ సంస్థ‌ల‌ను కోరారు. దీంతో, యూట్యూబ్ ....దాదాపు 50 చానెళ్ల‌పై నిషేధం విధించింది. దాదాపు 5 లక్ష‌ల వీడియోల‌ను త‌మ సైట్ నుంచి తొల‌గించింది. అయితే, రోజూ కొన్ని వేలాది వీడియోలు అప్ లోడ్ అవుతుండ‌డంతో త‌న సిబ్బందిని మ‌రింత పెంచాల‌ని యూట్యూబ్ నిర్ణ‌యించుకుంది. ఆ త‌ర‌హా కంటెంట్ ను తొల‌గించేందుకు ప్ర‌త్యేకంగా 10 వేల మంది సిబ్బందిని నియ‌మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు, యూట్యూబ్ కిడ్స్ వీక్షించే పిల్ల‌ల‌పై త‌ల్లిదండ్రులు నిఘా వేసి ఉంచాల‌ని ఆ సంస్థ కోరింది. ఏవైనా వీడియోలు అభ్యంత‌ర‌క‌రంగా కనిపిస్తే త‌మ‌కు తెలియ‌చేయాల‌ని సూచించింది.
Tags:    

Similar News