యూట్యూబ్ సంస్కరణ.. యూజర్స్ షాక్

Update: 2019-11-12 10:53 GMT
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తన వినియోగ దారులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. 2019 డిసెంబర్ 10 నుంచి యూట్యూబ్ సంస్కరణల బాట పడుతోంది. ఈ మేరకు ఇప్పటికే అందరు వినియోగ దారులకు ఈమెయిల్స్ చేసింది. యూట్యూబ్ కఠిన నిబంధనల కారణం గా చాలా మంది కొత్త క్రియేటర్స్, యూట్యూబ్ చానెల్స్ కనుమరుగు కానున్నాయి.

యూట్యూబ్ తాజా గా యాడ్ రెవెన్యూ పై పెద్ద దెబ్బ కొట్టింది. యూజర్లు పెట్టే వీడియోలకు యాడ్ రెవెన్యూ అంతంత మాత్రం గానే వచ్చినా.. పూర్తిగా రాక పోయినా ఆ   చానెల్ ఇక యూట్యూబ్ లో కనిపించదు. యూజర్ కు సంబంధించిన పూర్తి డేటా ను గూగుల్ డేటా నుంచి తొలిగించేస్తారు. అంతే కాదు.. వారికి ఇక జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోస్ తదితర సర్వీసులను కూడా వాడు కోకుండా నిషేధం విధిస్తారు. దీని ద్వారా యూట్యూబ్ ను సరదాకు వాడుకునే వారికి, అడపా దడపా వీడియోలు షేర్ చేసే వారు, కొంత మంది క్రియేటర్స్ కు భారీ దెబ్బ పడనుంది.

యూట్యూబ్ సంస్కరణలు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ లో ప్రవేశించే వారికి.. క్రియేటర్స్ కు శాపంగా మారాయి. వారి వీడియోల కు వ్యూస్ రాకుంటే ఆ వీడియోలు డిలీట్ కావడంతో పాటు మొత్తం వీడియోలు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడుతోంది.

అయితే దీని పై యూట్యూబ్ మాత్రం ఒక ప్రకటన చేసింది. సంస్కరణల వల్ల యూట్యూబ్ చాలా మందికి మరింత చేరువవుతుందని.. కంటెంట్ జెన్యూన్ గా క్రియేట్ చేసే వారికి ఈ సంస్కరణలు మేలు చేస్తాయని చెబుతోంది.

అయితే ఈ నిర్ణయం వినియోగ దారులకు మాత్రం షాకిస్తోంది. కొత్త కంటెంట్ అందించే వారికి యూట్యూబ్ నిబంధనలు శరఘాతంగా మారుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల పెద్ద క్రియేటర్ల కు మాత్రమే లాభం ఉంటుందని మండి పడుతున్నారు.


Tags:    

Similar News