బెలూన్లతో కుక్కను గాల్లో ఎగరేసిన యూట్యూబర్ అరెస్ట్ .. !

Update: 2021-05-28 04:30 GMT
కుక్కలు మనుషుల కంటే విశ్వాసం ఎక్కువగా చూపిస్తాయని అంటారు. అందుకేనేమో ప్రస్తుతం దాదాపుగా అందరి ఇళ్లల్లో కుక్కలు ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు చూస్తే మనుషుల కంటే ఆ కుక్కల జీవితమే బాగుంది అని అనిపిస్తుంది. అలాగే వీధి కుక్కలు కూడా ఉంటాయి. ఏ కుక్కలైనా కూడా విశ్వాసం మాత్రం ఒక్కటే. అయితే , కొందరు మాత్రం ఆ మూగజీవాలపై తమ పైచాచికతత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఓ యూట్యూబర్ కూడా అదే పని చేసి ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు.

వివరాల్లోకి వెళ్తే ..ఓ యూట్యూబర్ తన పెంపుడు కుక్క డాలర్ కు బెలూన్లు కట్టి గాల్లో ఎగరేసి దానిని వీడియో తీశాడు. అనంతరం దానిని యూట్యూబ్‌ లో పోస్టు చేసి వ్యూస్ రాబట్టే ప్రయత్నం చేశాడు. ఇది కాస్తా పోలీసుల దృష్టికి చేరడంతో యూట్యూబర్ గౌరవ్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెంపుడు జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు గాను అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వీడియో పై సర్వత్ర విమర్శలు వ్యక్తం కావడంతో గౌరవ్ ఆ వీడియోను డిలీట్ చేశాడు. క్షమాపణలు చెబుతూ మరో వీడియోను పోస్టు చేశాడు. గౌరవ్‌ పై మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.  ఈ నెల 21న గౌరవ్ తన యూట్యూబ్ చానల్‌లో ‘ఫ్లయింగ్ డాలర్ విత్ హీలియం గ్యాస్ బెలూన్’ అనే క్యాప్షన్‌ తో వీడియో పోస్టు చేశాడు. దీనిపై విమర్శలు రావడంతో ఆ వీడియోను డిలీట్ చేసిన గౌరవ్ మరో వీడియోను పోస్టు చేస్తూ.. దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దని, ‘డాలర్’ ను ఎగరేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఓ షాపులో గౌరవ్ బెలూన్లు కొంటూ కుక్కను ఎగరేసేందుకు ఎన్ని బెలూన్లు అవసరమవుతాయని అడగడం కూడా ఆ వీడియోలో స్పష్టంగా వినిపించింది. గౌరవ్‌జోన్ పేరుతో ఉన్న అతడి యూట్యూబ్ చానల్‌కు 4.15 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పెంపుడు శునకాన్ని గాల్లో ఎగరేసిన వీడియోను అతడు పోస్టు చేసిన వెంటనే విమర్శలు పోటెత్తాయి. దీంతో ఆ వీడియోను డిలీట్ చేసిన గౌరవ్.. తనకు పెంపుడు జంతువులంటే ఎంతో ప్రేమ అని చెప్పుకొచ్చాడు. కుక్కను గాల్లో ఎగరేసినందుకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు చెప్పాడు.భవిష్యత్‌ లో ఇలాంటివి మరోసారి చేయనని తన వ్యూయర్స్‌ కు హామీ ఇచ్చాడు.
Tags:    

Similar News