ఏపీ సీఎం జగన్.. ఏదైనా ఒక వ్యక్తి గురించి కానీ, ఒక నియోజకవర్గం గురించి కానీ, ప్రధానంగా ప్రస్తావించారం టే.. దానివెనుక పెద్ద రీజనే కనిపిస్తోంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్న అనేక పనుల రీత్యా.. ఆయన వెచ్చించే ప్రతినిముషానికి తూకం వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆచి తూచి నేతలను తన పేషీకి పిలుస్తున్నారు. అలా పిలిచారు.. అంటే ఖచ్చితంగా.. ఏదో ఒక 'విషయం' ఉండే తీరుతుంది.
ఇప్పుడు ఉమ్మడి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజకవర్గం గురించి సీఎం జగన్ సమీక్షించారు. నిజానికి నియోజకవర్గాల సమీక్ష చేస్తున్నారు కదా.. దానిలో భాగంగానే దీనిని కూడా చేసి ఉంటారు అని అనుకుంటే తప్పులో కాలేసినట్టే.
ఎందుకంటే.. ఇది ప్రత్యేకమైన నియోజకవర్గం. పైగా.. సీఎం జగన్‌కు ఎంతో కావాల్సిన నియోజకవర్గం. అంటే.. ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ కావాల్సిన వ్యక్తా కదా? అన్నది ముఖ్యం కాదు.
నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీ తరపున ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమా.. సీఎం జగన్‌కు కావాల్సిన మనిషి! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నిజం. ఇది వ్యక్తిగతం కాదు.. రాజకీయం. గత ఎన్నికల్లో ఉమా ను ఓడించడమే లక్ష్యంగా అప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చుకుని.. జోగి రమేష్‌కు ఇవ్వాల్సిన టికెట్‌ను రాత్రికి కృష్ణప్రసాద్‌కు దక్కించారు జగన్. అంటే.. ఉమా ఓటమే ఆనాడు లక్ష్యం.
ఇప్పుడు కూడా అదే. వ్యక్తులతో పనిలేదు. ఉమాను ఓడించేవారు కావాలి. అది కేపీ వల్ల అవుతుందా కాదా అన్నది తేల్చుకోవడమే తాజాగా సమావేశం ఉద్దేశం. ప్రస్తుతం ఉన్న తాడేపల్లి వర్గాల అంచనా ప్రకారం .. ఫిఫ్టీ ఫిఫ్టీగా జగన్ ఈ నియోజకవర్గం విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. అంటే.. మళ్లీ కేపీకి ఇచ్చినా.. దేవినేని ఉమా ఓటమి తథ్యమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.