ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ కు బయలుదేరిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సోమవారం ఆయన తన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే లతో కలిసి జంతర్ మంతర్ వద్ద ధర్నాచేపట్టారు. అనంతరం పార్లమెంట్ ముట్టడికి బయలుదేరారు. వెంటనే వారిని పోలీసులు అరెస్టు చేయడంతో కార్యకర్తలు రోడ్డుమీదే బైఠాయించారు.
ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కడప జిల్లాకు చెందిన ప్రసాద్ రెడ్డి అనే వైకాపా కార్యకర్త గాయపడ్డారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఓ కొత్త జోస్యం చెప్పారు. ఢిల్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని...ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అమాయకులకు దెబ్బలు తగలకూడదన్న ఉద్దేశంతోనే తనతో పాటు ఏడుగురు ఎంపీలు, 66 మంది ఎమ్మెల్యేలు అరెస్టయ్యామన్నారు.
ఢిల్లీలో ప్రత్యేక హోదాపై ధర్నా చేసేంత వరకు జగన్ కు జనం మద్దతు పలికారు. కానీ అమాయకుల కోసం అరెస్టయ్యామని చెప్పడంతో... జగన్ అసలు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లారా...పబ్లిసిటీ స్టంట్‌తో వెళ్లారా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం మునికోటి ఆత్మహత్య చేసుకున్న టైంలో కేంద్రానికి కనువిప్పు కలిగించేలా ఫైట్ చేసే మంచి ఛాన్స్ వచ్చినా జగన్ సద్వినియోగించుకోలేదు. జగన్‌తో పాటు అరెస్టయిన వారిలో ఎంపీలు, ఎమ్మెల్యే లతో పాటు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తదితరులు ఉన్నారు.