తృటిలో పెను ప్రమాదం నుంచి వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ తప్పించుకున్నారు. వేగంగా వెళుతున్న ఆయన కారు టైరు పంక్ఛర్ కావటంతో పెద్ద శబ్ధం రావటం.. కారు అదుపు తప్పటంతో ఒక్క క్షణం ఏమైందన్నది అర్థం కాని పరిస్థితి. అయితే.. జగన్ వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి.. క్షణాల్లో అప్రమత్తంగా వ్యవహరించటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కర్నూలు యువభేరీలో పాల్గొని హైదరాబాద్ కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్ ప్రయాణిస్తున్న కారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాల్మాకుల వద్ద పంక్చర్ అయింది. దీంతో.. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. వేగంగా వెళుతున్న కారుకు ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి.. రోడ్డు పక్కకు తీసుకెళ్లి నిలిపివేశారు.
ఆ వెంటనే జగన్ వెనుక ఉన్న కార్ల నుంచి సిబ్బంది రక్షణ వలయంగా కారు చుట్టూ చేరుకున్నారు. జగన్ ప్రయాణిస్తున్న కారు టైరును మార్చిన అనంతరం ఆయన అదే కారులో వెళ్లిపోయారు. ఈ హఠాత్ పరిణామానికి జగన్ సన్నిహితులు ఉలిక్కిపడ్డారు. జగన్ వాహనం వెనుక ఉన్న కార్లలోని ఆయన సన్నిహితులకు ఈ ఘటనతో గుండె ఒక్కసారి జారినంత పనైందన్న వ్యాఖ్యలు వినిపించటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/