శత్రువుకు.. శత్రువు మిత్రుడన్న నానుడి ఊరికే పుట్టలేదు.. ఆగర్భ శత్రువును ఓడించడానికి మరో మిత్రుడితో జట్టు కట్టడం సహజమే... అందుకే ఒకప్పుడు పడని ఆ రెండు కుటుంబాల మధ్య ఇప్పుడు స్నేహం చిగురించింది. వారిని దగ్గరి చేసింది.
ఉమ్మడి ఏపీ ఉన్న రోజులవీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా.. తెలంగాణ రాష్ట్రసమితి అధినేతగా కేసీఆర్ ఉండేవారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎగిసిపడేలా చేసినప్పుడల్లా వైఎస్ ఎదుర్కొనేవారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి ఆ పార్టీని దెబ్బతీయడంలో వైఎస్ వ్యూహాలు ఫలించాయి. టీఆర్ ఎస్ పదిలోపే స్థానాలకు పరిమితం చేయడంలో రాజకీయంగా దెబ్బకొట్టడంతో వైఎస్ విజయం సాధించారు. కేసీఆర్ రాజీనామా చేసిన కరీంనగర్ కు ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ను దాదాపు ఓడించినంత పనిచేసి మెజార్టీని వైఎస్ బాగా తగ్గించారు.
వైఎస్ ఉన్నన్ని నాళ్లు టీఆర్ ఎస్ ఎదగలేదు.. బలపడలేదు. ఆయన హెలీక్యాప్టర్ ప్రమాదంలో మరణించాక కేసీఆర్ కోలుకున్నారు. ఉద్యమంతో తెలంగాణ సాధించారు. నిజానికి వైఎస్ బతికుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం రాజకీయాల్లో ఉంది. అంతటి బలమైన వైఎస్ లాంటి నాయకుడు ఉంటే ఏపీ, తెలంగాణ విడిపోయి ఉండేది కాదని.. ఇన్ని కొట్లాటలు జరిగి ఉండేది కాదని.. ఏపీ రాజధాని లేకుండా ఇంత నష్టపోయి ఉండేది కాదన్న అభిప్రాయం ఉంది.
అయితే ఉమ్మడి ఏపీలో వైఎస్ అంటేనే కేసీఆర్ కు పడేది కాదు.. తన పార్టీని, ఎమ్మెల్యేలను లాగేసిన వైఎస్ పై శత్రుభావంతో ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వైఎస్ కొడుకు మిత్రుడయ్యారు.. మిత్రుడైన చంద్రబాబు కేసీఆర్ కు శత్రువయ్యాడు. ఇప్పుడు వైఎస్ కుమారుడితో కేసీఆర్ స్నేహగీతం ఆలపిస్తున్నారు.. ఇందుకు కారణం చంద్రబాబే..
రాజకీయాల కోసం ఎవరినైనా వాడేసే బాబు.. అనవసరంగా కేసీఆర్ తో పెట్టుకొని చాలా మునిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ తో జట్టుకట్టి తన అనుకూల మీడియాతో రచ్చ చేసి కేసీఆర్ ను ఓడించడానికి శతవిధాలా చంద్రబాబు ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. ఆ కసిని మరిచిపోని కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. అన్నట్టుగా ఏపీ ఎన్నికల వేళ జగన్ తో కలిసి ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఇతర రాజకీయాలు బాగానే చేశారన్న టాక్ నడిచింది.. హైదరాబాద్ నుంచి చేయాల్సిందంతా చేశారన్న ప్రచారం .జరిగింది. జగన్ గెలుపులో ఎన్ని ఫ్యాక్టర్లున్నా కేసీఆర్ పాత్ర కూడా ఉందన్న అంచనాలున్నాయి. ఇక ఏపీ ఎన్నికలకు రెండు రోజుల ముందు కేసీఆర్ చేసిన ప్రకటన జగన్ కు బూస్ట్ అయ్యింది. ఏపీ ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు, పోలవరానికి అడ్డుకోం అన్న ప్రకటన వైసీపీకి లాభించింది. చంద్రబాబు ఎంత జగన్-కేసీఆర్-మోడీ కలిశారని యాగి చేసినా జనాలు మాత్రం జగన్ నే గెలిపించారు.
ఒకప్పుడు తనకు శత్రువైన వైఎస్ కుమారుడిని ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ చంద్రబాబు ఒంటరిని చేసి హింసించడం కేసీఆర్ చూశారు.. టీడీపీ లాబీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ఆరోపణలతో జగన్ స్థైర్యంపై కొట్టారు. దేశంలో ఎంతో మంది రాజకీయ నేతలున్నా.. జగన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించింది టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు మాత్రమే.. అందుకే జగన్ తన ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ను ఆహ్వానించడానికి ఈ సాయంత్రం 4.30గంటలకు వస్తున్నారు. ఆ వెంటనే 5 గంటలకు కేసీఆర్ వద్దకు ప్రగతి భవన్ వెళ్తున్నారు. తొలిపిలుపు కేసీఆర్ కే ఇస్తున్నారు. ఉమ్మడి శత్రువు చంద్రబాబును ఓడించామన్న ధీమా ఈ ఇద్దరిలో కనపడుతోంది. ఒకరినొకరు సాయం చేసుకోకపోతే ఈ గెలుపు వచ్చేది కాదు.. అదుకే తన తొలి ప్రాధాన్యాన్ని జగన్ కేసీఆర్ కే ఇచ్చారు. తన సీఎం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న నానుఢి.. ఇప్పుడు నిజమవుతోంది.