ఒకవైపు రాజకీయాల గురించి ఆసక్తి ఉన్న వాళ్లే నిద్రపట్టనట్టుగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే అంశం గురించి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్లంతా తీవ్రంగా చర్చించుకొంటూ ఉన్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారనే అంశం గురించి వారు తెగ ఇదైపోయి చర్చించుకొంటూ ఉన్నారు.
వారేమీ ఎన్నికల్లో పోటీ చేసిన వారు కాదు. ఏదో ఆసక్తితో రాజకీయాలను గమనించే వారే. వారికే ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే అంశం గురించి టెన్షన్ పట్టుకుంది. అయితే అసలైన వ్యక్తుల్లో ఒకరైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కామ్ గా కూల్ గా ఉన్నారు.
ఆయన ఎంత రిలాక్డ్స్ గా ఉన్నారో చాటి చెబుతున్న మరో అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన కుటుంబంతో కలిసి జగన్ మోహన్ రెడ్డి అవేంజర్స్- ది ఎండ్ గేమ్ సినిమాకు వెళ్లడం ఆసక్తిదాయకంగా ఉంది. మహేశ్ బాబుకు చెందిన మల్లీప్లెక్స్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలిసి ఆ సినిమాను వీక్షించారు.
జగన్ కుటుంబం ఆ సినిమాకు రానుండటంతో ముందుగానే మొత్తం ఆ స్క్రీన్ లోని సీట్లన్నింటినీ బ్లాక్ చేయించారట. జగన్ కుటుంబీకుల్లోని కొందరు ఆ సినిమాను వీక్షించడానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఇలా సినిమాలు చూసి.. కుటుంబంతో సరదాగా గడిపేంత తీరికగా, రిలాక్డ్స్ గా ఉన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి విజయం మీద ధీమాతోనే ఇంత కూల్ గా ఉన్నారని స్పష్టం అవుతూనే ఉంది. ఎన్నికల ముందు విపరీత స్థాయిలో కష్టపడి జగన్ ఇప్పుడు మాత్రం కామ్ గా కనిపిస్తూ ఉన్నారు.