బ్రేకింగ్: ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ.. బాబు కు షాక్

Update: 2020-01-22 11:11 GMT
ఏపీ అసెంబ్లీ లో సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని పేరిట రైతుల భూములు కొల్లగొట్టి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తో పాటు టీడీపీ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు. రాజధాని అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు అసెంబ్లీ లో తీర్మానం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ పరిణామం టీడీపీ నేతలకు గుబులు రేపింది.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. సభలో హోంమంత్రి సుచిరిత ఈ మేరకు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని ఆమె ప్రకటించారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుపుతామని.. తప్పు చేసిన వారిని జైలుకు పంపుతామని జగన్ ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో 4070 ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే  శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Tags:    

Similar News