వైఎస్ జగన్ మూడేళ్ళ తరువాత మునుపటి దూకుడుని చూపిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత తాడేపల్లి గడప దాటకుండానే గడిపేశారు. మొత్తం ప్రభుత్వాన్ని క్యాంప్ ఆఫీస్ చుట్టే నడిపించారు. ఇక రెండు సార్లు కరోనా వచ్చింది. ఆ టైమ్ లో కూడా జగన్ బయటకు రాకుండానే మొత్తం మ్యానేజ్ చేశారు. ఇలా చూస్తూండగానే రోజులు గడచిపోయాయి.
పుణ్యకాలం కూడా సాగిపోయింది. ఈ నేపధ్యంలో రెండేళ్లల్లో ఎన్నికలు తోసుకువచ్చేస్తున్నాయి. దాంతో ఇపుడు జగన్ ఒక్కసారిగా జోరు పెంచేశారు. ఇలా లాభం లేదనుకున్నారో ఏమో గేర్ మార్చేశారు. అటు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇటు కొత్త మంత్రివర్గాన్ని కూడా రెడీ చేస్తున్నారు.
మరో వైపు చూస్తే సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి వారిని పార్టీని చూడమంటున్నారు. కొత్త మంత్రులతో కలసి ఎమ్మెల్యేలను జనాల్లోకి వెళ్ళమని ఆదేశించాలనుకుంటున్నారు. మే నెల నుంచి గడప గడపకూ వైసీపీ పేరిట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఇక జగన్ సైతం జనంలోకి రావాలనుకుంటున్నారు. ఇక మీదట జిల్లాల టూర్లు ఉంటాలన్న ఆయన వైఖరిని స్పష్టం చేస్తోంది. కొత్త జిల్లాలలో విస్తృతంగా తిరుగుతూ ప్రజలలోనే నిరంతరం ఉండేలా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నారు.
ఒక విధంగా అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఒకే సమయంలో రీచార్జి చేయడం ద్వారా డబుల్ ఇంజన్ తో దూసుకురావాలని జగన్ భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది జూలైలో పార్టీ ప్లీనరీని నిర్వహించడం ద్వారా పార్టీకి పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా 2024 వరకూ ఫుల్ టైమ్ టేబిల్ ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
బూత్ లెవెల్ నుంచి మంత్రుల దాకా, ముఖ్యమంత్రి దాకా, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుల నుంచి వార్డు ప్రెసిడెంట్ దాకా అంతా జనంలోనే ఉండేలా యాస్ఖన్ ప్లాన్ ని రెడీ చేస్తున్నారు. రానున్న కాలమంతా వైసీపీ ప్రచారాన్ని ఉధృతంగా చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు.
ప్రతిపక్షాల కంటే ముందే జనంలో ఉండడం ద్వారా పొలిటికల్ మైలేజ్ ని తామే పొందాలని అడ్వాంటేజ్ ని తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు. విపక్షాలకు అసలు చాన్స్ ఇవ్వకూడదు అని కూడా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి జగన్ దూకుడే దూకుడు అన్నట్లుగా ఉన్నారు. చూడాలి మరి పార్టీ పరుగు ఏ రేంజిలో ఉంటుందో.