హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ల వెల్లువ అంతకంతకూ పెరుగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కొన్నేళ్ల క్రితం కొన్ని పిటిషన్లు దాఖలు కావటం.. తదనంతర పరిణామాల సంగతి తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. తన ఛరిష్మాతో బంపర్ మెజార్టీని సాధించి మరీ ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించారు. గడిచిన మూడేళ్లుగా ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయనపై ఉన్న కేసుల లెక్క తేల్లేదు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్ని నమోదు చేసే పనిలో భాగంగా.. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లుగా ఉన్న ఆరోపణల సంగతి తెలిసిందే.
అయితే.. ఈ కేసుల దాఖలు వెనుక అసలు విషయం ఏమిటన్న సంగతి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరికి తెలిసిందే. రాజకీయ కక్ష పూరితంగా పెట్టిన కేసుల విచారణ జరుగుతున్న వేళ.. వైసీపీ రెబల్ ఎంపీ కమ్ నరసాపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. అప్పటి నుంచి వాతావరణం వేడెక్కిపోవటం తెలిసిందే. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో పాటు కరోనా కేసుల కారణంగా లెక్కలు తేలే విషయంలో ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను ఈ నెల 26న కోర్టు ఎదుటకు విచారణ రానుంది.
ఇదిలా ఉండగా.. తాజాగా సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. తన మీద ఆరోపణలు సంధించిన పెన్నా సిమెంట్స్ కేసు నుంచి తన పేరును రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు. సీఎం జగన్ తో పాటు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సైతం తనపై ఉన్న కేసులో తన పేరును డిలీట్ చేయాలని కోరుతున్నారు. పెన్నా.. ఇందూ టెక్ జోన్ కు సంబంధించిన కేసుల నుంచి తనను తప్పించాలని కోరుతూ ఆమె తాజాగా మరో పిటిషన్ ను దాఖలు చేశారు.
జగన్.. సబితతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారికి శ్యామూల్ రాజగోపాల్.. వై శ్రీలక్ష్మీలు కూడా వేర్వేరుగా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారు. మరి.. ఈ కేసులన్నింటిని కలిసి వారి వాదానల్ని ఒకేసారి వింటుందా? వేర్వేరుగా విచారణ జరపుతారా? అన్నదిప్పుడు ప్రవ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీబీఐ సైతం తన సమాధానాన్ని చెప్పేందుకు మరికొంత టైం అడుగుతోంది. విచారణ సాగుతుందని.. సమగ్ర రిపోర్టును త్వరలో కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. వాదనలు వినేందుకు కోర్టు సిద్ధమైంది. మరి.. ఇప్పుడు కోర్టు ఏం చెప్పనుంది? సీఎం జగన్ కు ఊరట కలిగిందనుందా? ఇంకేదైనా జరగనుందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తేలాల్సి ఉంది.