ఏపీలో కొత్త మంత్రివర్గం రాబోతోందా? ఈ నెలలోనా?

Update: 2021-03-25 08:55 GMT
పంచాయతీ - మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం పరిపూర్ణమైన వేళ సీఎం జగన్ ఇక పాలనపై దృష్టి సారించారు. ఈరోజు కర్నూలు ఎయిర్ పోర్టును ప్రజలకు అంకితమిచ్చి రాయలసీమ వాసుల కళను నెరవేర్చారు. మంత్రివర్గాన్ని విస్తరించడానికి రెడీ అవుతున్నట్లు అమరావతి వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏపీలో సీఎం జగన్ 151 సీట్లు గెలిచిన తర్వాత సామాజిక కోణంలో కొందరు సీనియర్లు మంత్రి పదవులు ఇవ్వలేకపోయారు. బలమైన రెడ్డి - ఇతర సీనియర్ నేతలకు జగన్ చోటివ్వలేదు. 80శాతం మంత్రివర్గంలో జగన్ భక్తులే ఉన్నారు. 20శాతం మంది కులాల సమీకరణాల్లో ఎవ్వరూ ఊహించని విధంగా మంత్రి పదవులు సంపాదించారు.

అయితే మంత్రులుగా నియామకమైన తర్వాత కొందరి ప్రవర్తన బాగాలేదని.. ఎప్పుడు చూసినా ఆఫ్ లైన్ లో ఒక మాట.. ఆన్ లైన్ లో ఒక మాట మాట్లాడుతున్నారని సీఎంవోకు తెలిసిందని టాక్. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇంటెలిజెన్స్ తో సమాచారం తెప్పించుకుంటున్నారట..

అయితే ఈ విషయం కొందరికి తెలిసి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని డిసైడ్ అయ్యారట.. దండుకున్నవాడికి దండుకున్నంత అని ఈ మధ్య జరిగిన మున్సిపాలిటీ - పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున క్యాండిడేట్ల నుంచి డబ్బులు గుంజారట. ఇప్పుడు ఈ రిపోర్టు సీఎం దగ్గర చిట్టా ఉందంట..
 
ఇక లా అండ్ ఆర్డర్ డిపార్ట్ మెంట్ లో బదిలీల పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. కొన్ని అయితే సీఎం చెప్పాడని.. పెద్ద పెద్ద అధికారుల దగ్గర సంతకాలు చేయించారట.. ఇలా చాలా అవినీతి మరకలు ఉన్న మంత్రులను ఇంటికి పంపించాలని.. అయితే పార్టీకి నష్టం జరుగకుండా ఉండాలని జగన్ భావిస్తున్నాడట..

కర్రవిరగకుండా పాము చచ్చేలా జగన్ కొత్త మంత్రివర్గ కూర్పు జరుగుతోందని టాక్ నడుస్తోంది. అయితే ఆగస్టు వరకు ఈ కేబినెట్ విస్తరణ ఉంటుందని.. ముందు రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టి ప్రజల దగ్గర కొంత సమాచారం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నాట.. అప్పుడే నిజమైన ఫీడ్ బ్యాక్ వస్తుందని.. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయాలని జగన్ భావిస్తున్నాడట.. అందుకే ఆగస్టు ఫస్ట్ వీక్ లో కొత్త మంత్రివర్గం వస్తోందని ప్రచారం సాగుతోంది.  

    

Tags:    

Similar News