కుల రాజ‌కీయాలు వ‌ద్దుః జ‌గ‌న్‌

Update: 2017-06-30 10:01 GMT
ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదని వైకాపా అధినేత వైఎస్ జగన్ అన్నారు ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో పర్యటించిన ఆయన - దళితులతోనూ - దళితేతరులతోనూ మాట్లాడారు. స‌మ‌స్య‌ను సామర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు.

తాను కేవ‌లం అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనే వచ్చానని, సమాజంలో అందరూ కలసి ఉండాలన్నదే తన అభిమతమని అన్నారు. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకేనేందుకు ప్ర‌య‌త్నించాల‌ని,  దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదని అన్నారు.అందరినీ సంతోష పెట్టాలన్న ఉద్దేశంతోనే తాను ఇక్క‌డికి వచ్చానని అన్నారు.

కొంతమంది మాత్రం సమస్యను పెద్దది చేస్తున్నారని దళితేతరులు జగన్ కు ఫిర్యాదు చేశారు. సోదరభావంతోనే తాము బతకాలనుకుంటున్నామన్నారు. కొందరి వల్ల ఈ సమస్య వచ్చిందని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటివరకూ నిలిచిందన్నారు. సమస్యను గ్రామస్థుల‌కే వదిలేస్తే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండువైపులా ఉన్నాయన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News