గ‌వ‌ర్న‌ర్‌ ను క‌లిసి బాబును క‌డిగేసిన జ‌గ‌న్‌

Update: 2017-04-03 13:13 GMT
ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సంద‌ర్భంగా టీడీపీ మంత్రివర్గంలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై వైసీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హైద‌రాబాద్‌ లోని రాజ్‌ భ‌వ‌న్‌ లో గ‌వ‌ర్న‌ర్‌ ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. గవర్నర్‌ తో భేటీ అనంతరం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచిన వారికి మరో పార్టీలో మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదని  ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు ఏమైనా చేయొచ్చు అంటే ప్రజాస్వామ్యం బతకదని జ‌గ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసేలా గట్టిగా పోరాటం చేస్తామని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.

పార్టీ పిరాయింప‌చేయడం మంత్రి పదవులు పొందిన వారి రాజీనామాలు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు వైఎస్ జ‌గ‌న్ తెలిపారు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచి, ఆ పార్టీ ద్వారా ఎమ్మెల్యే పదవులు సంపాదించి, వాటికి రాజీనామా చేయకుండా, వారు అనర్హులుగా పరిగణించకుండా ఇప్పుడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం ప్రజాస్వామ్యమేనా అని గ‌వ‌ర్న‌ర్‌ను అడిగిన‌ట్లు జ‌గ‌న్ వివ‌రించారు. తెలంగాణలో ఇదే విషయంలో తలసాని శ్రీనివాసయాదవ్‌ కు టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చిన ప్పుడు అప్పట్లో చంద్రబాబు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోమని గవర్నర్‌ ను కోరామ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. `సార్‌ ఇది ప్రజాస్వామ్యమేనా? ఒక పార్టీ నుంచి గెలిచిన వారు.. వారి రాజీనామా ఆమోదించకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయ వ్యభిచారులుగా చంద్ర‌బాబు పోల్చారు. ఆ రోజు చంద్రబాబు మాటలు, ఇవాళ ఆయన చేస్తున్న చేష్టలు సబబేనా?` అని గ‌వ‌ర్న‌ర్‌కు విన్న‌వించిన‌ట్లు జ‌గ‌న్ వెల్ల‌డించారు.

ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం తప్పు అవుతుంద‌ని జ‌గ‌న్ అన్నారు. ``స్పీకర్‌ కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 68 మంది వైయస్‌ ఆర్‌ సీపీ ఎమ్మెల్యేల బలమని చదివారు. కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వులు ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మంత్రి పదవులు ఇవ్వడం సరికాదు. రాజీనామాలు ఆమోదింపబడేలా చర్యలు తీసుకోండి`` అని గవర్నర్‌ ను కోరామ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఒక‌వేళ చంద్ర‌బాబు ఇలా చేయ‌లేక‌పోతే  మీరే దగ్గరుండి వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశామ‌ని తెలిపారు. ``ఇటువంటి తప్పులు జరుగకుండా ఉండేందుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవచ్చు. అలాంటి గవర్నర్‌ తోనే తప్పులు చేయిస్తే ప్రజాస్వామ్యాన్నికి విలువేముందని కోరాం. ఇదే విషయంపై రాష్ట్రపతి - ఎన్నికల కమిషన్ - ప్రధాని నరేంద్రమోడీ - వివిధ పార్టీల నాయకులను కలుస్తాం. ఈ విషయంపై అందర్ని కలుస్తాం, ఇవాళ మా దాకా వచ్చింది. రేపు మీదాకా వస్తుంది. ఇలా చేస్తే ప్రజాస్వామ్యం చతికిలపడే పరిస్థితి వస్తుందని ఆ పార్టీలను ప్రేరేపిస్తాం. ఈ నలుగురు చేత రాజీనామాలు చేసేలా ఒత్తిడి తెస్తాం`` అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌మ‌కు ఢిల్లీ స్థాయిలో మ‌ద్ద‌తు లేద‌న్నారు. ప్రజాస్వామ్యంలో మ‌ద్ద‌తు లేకపోవడమే పాపమన్నట్లుగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్లను అధికార బలంతో కొడితే ప్రజాస్వామ్యం బతకదని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News