మాటల్లో వినిపించే ఆదర్శం.. చేతల్లో వచ్చేసరికి పత్తాలేకుండా పోవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర బాగానే కనిపిస్తుంది. నీతికి.. నిజాయితీకి నిలువెత్తురూపంగా.. నిప్పులాంటి రాజకీయ జీవితం తనదిగా చెప్పుకోవటంలో బాబుకు సాటి వేరెవరూ రారు. వెన్నుపోటు రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో పరిచయం చేయటమేకాదు.. పిల్లను ఇచ్చిన మామను పదవి కోసం ఎంతటి మానసికక్షోభకు గురి చేసింది అందరికి తెలిసిందే.
అయితే.. నాటి మీడియా పుణ్యమా అని చాలా విషయాలు బయటకు రాని పరిస్థితి.
తాజాగా తెలంగాణలో తన పార్టీ ఎమ్మెల్యేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి ఇస్తే నానా యాగీ చేసి.. అసెంబ్లీలో మాట్లాడటమే కాదు.. ఆ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలుఖండించాలని చెప్పిన చంద్రబాబు.. ఈరోజు ఏపీ విపక్షానికి చెందిన ఎమ్మెల్యేల్ని ఫిరాయింపులకు ప్రోత్సహించటమే కాదు.. వారిలో నలుగురికి ఏకంగా మంత్రిపదవులు ఇచ్చిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు చేసిన పనిని పలువురు తప్పు పడుతున్నా.. ఆయన మాత్రం ఏ మాత్రం రియాక్ట్ కాని పరిస్థితి. అంతేకాదు.. ఆ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. రివర్స్ గేర్ లో అర్థం లేని మాటలు చెబుతున్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు తీరును బట్టబయలు చేయటంతో పాటు.. ఆయన నిజస్వరూపం ఏమిటో అందరికి అర్థమయ్యేలా చేసే ప్రయత్నాన్ని షురూ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి.. బాబు మీద ఫిర్యాదు చేసిన జగన్.. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ను కలిసి బాబు తీరును వివరించారు.
దాదాపు అరగంటకు పైగా ములాయంను కలిసిన ఆయన.. తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల్ని ఫిరాయింపులకు ప్రోత్సహించటమే కాదు.. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన వైనాన్ని వివరించారు. బాబు అసలు గుట్టు విప్పిన జగన్.. ఏపీ స్పీకర్ వద్ద ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉండగా నలుగురిని మంత్రులుగా ఎలా చేస్తారని అడిగారు. జగన్ చెప్పిన సమాచారం విన్న ములాయం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బాబు అనుసరిస్తున్న తీరును ప్రశ్నించని పక్షంలో.. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని ములాయంను కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/